E-Paper
Advertisement

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?

బంగ్లాదేష్ గ్యాంగ్‌తో ప్రేమలో పడి.. జీవితాన్ని నాశనం చేసుకున్న టెకీ?
Advertisement

Drug Racket: స్వేచ్చ బ్యూరో: వ్యభిచారంతోపాటు డ్రగ్స్ దందా చేస్తున్న బంగ్లాదేశీయురాలితోపాటు ఆమెతో సహజీవనంలో ఉన్న టెకీని ఈగల్ ఫోర్స్ అధికారులు రాయదుర్గం పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి డ్రగ్స్, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాకు చెందిన 30ఏళ్ల మహిళ కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కోవిడ్ సమయంలో గార్మెంట్ పరిశ్రమలో ఉద్యోగం కోల్పోవడంతో ఉపాధిని వెతుక్కుంటూ 2021, డిసెంబర్ లో టూరిస్ట్ వీసాపై భారతదేశానికి వచ్చింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన..

ఇక్కడ సరైన ఉద్యోగం దొరకకపోవడంతో ఫేస్‌ బుక్ ద్వారా పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన నూర్ అనే బ్రోకర్ సహాయం కోరింది. ఆమె పరిస్థితిని అవకాశంగా చేసుకున్న నూర్ తేలికగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆశ చూపించి వ్యభిచార కూపంలోకి దించాడు. ఆ తర్వాత ఆమె హైదరాబాద్‌ కు చెందిన జే, జేకే, చెన్నైకి చెందిన రాహుల్ అనే బ్రోకర్లతో చేతులు కలిపింది. ఈ ముగ్గురు కస్టమర్ల ఫోన్ నెంబర్లు, లొకేషన్లు షేర్ చేస్తే వారి వద్దకు వెళ్తూ వారానికి ఒకసారి డబ్బులు తీసుకునేది. బ్రోకర్ల సూచనల ప్రకారం నాగ్‌పూర్, కాన్పూర్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్, గోవా, ముంబై నగరాలకు తిరుగుతూ నెలకు దాదాపు 75వేల వరకు సంపాదించేది.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో సహజీవనం..

Advertisement

2021లో వ్యభిచార వృత్తిలో ఉండగానే హైదరాబాద్‌ కు చెందిన శ్యామ్ రావు (35) అనే సాఫ్ట్‌ వేర్ ఉద్యోగి కస్టమర్‌ గా పరిచయమయ్యాడు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగటంతో 2022 నుంచి షేక్‌ పేట్‌ లో సహజీవనం చేయడం ప్రారంభించారు. ఆమెపై ప్రేమతో శ్యామ్ రావు బంగ్లాదేశ్ వెళ్లి ఆమె తల్లిదండ్రులను కూడా కలిశాడు. ఈ విషయం తెలిసి శ్యామ్ రావు భార్య అతనికి విడాకులు ఇచ్చి విడిపోయింది. అయితే, శ్యామ్ రావుతో కలిసి జీవిస్తున్నా అతను ఆఫీస్ కు వెళ్లినపుడు సదరు మహిళ వ్యభిచారాన్ని కొనసాగించింది. ఈ క్రమంలో కస్టమర్ల ప్రేరణతో సింథటిక్ డ్రగ్స్ తీసుకోవడానికి అలవాటు పడింది. ఆ సమయంలోనే గోవాకు చెందిన ఆకాష్ అనే డ్రగ్ సప్లయర్ పరిచయమయ్యాడు.

Also Read: మాగింగ్ అంటే ఏంటి? ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న జెన్-జీ ట్రెండింగ్ స్లాంగ్ అసలు కథేంటి?

నకిలీ ఆధార్ కార్డ్.. 

Advertisement

ఆకాశ్ ‘డెడ్ డ్రాప్’ పద్ధతి ద్వారా గోవా, హైదరాబాద్‌ లలో ఆ మహిళ కస్టమర్లకు విక్రయించేది. ఇక, దేశంలో శాశ్వతంగా నివసించడానికి ఆమె ‘జియా శ్యామ్‌ రావ్’ అన్న పేరుతో నకిలీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ సృష్టించుకుంది. నకిలీ పేరుతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌ లో అకౌంట్ ఓపెన్ చేసి డ్రగ్స్ కొనడానికి.. వ్యభిచారం ద్వారా సంపాదించిన డబ్బును ఆ అకౌంట్ లోనే దాచింది. జియా ప్రొద్భలంతో ఆమెతో సహజీవనం చేస్తున్న శ్యామ్ రావు కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాడు. హైదరాబాద్‌ లో దినేష్, రమేష్, విరాట్, భరత్, శ్రీనాథ్, మహేంద్ర, ఓజీర్ తదితరులు జియాకు రెగ్యులర్ డ్రగ్ కస్టమర్లుగా మారారు.

పరారీలో..

ఇటీవల జియా గోవా నుంచి డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చిందనే పక్కా సమాచారంతో ఈగల్ ఫోర్స్ అధికారులు రాయదుర్గం పోలీసులతో కలిసి ఆమె నివాసంపై దాడి చేశారు. జియాతోపాటు శ్యామ్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో తనిఖీలు చెయ్యగా డ్రగ్స్ దొరికాయి. ఈ నేపథ్యంలో జియా, శ్యామ్ రావులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ప్రధాన డ్రగ్ సప్లయర్ అయిన గోవాకు చెందిన ఆకాష్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు. బంగ్లాదేశ్ వంటి దేశాల్లోని పేదరికం, నిరుద్యోగాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశంలోని కొంతమంది బ్రోకర్లు యువతులను వ్యభిచారంలోకి దించుతున్నారని, ఆ తర్వాత వారిని డ్రగ్స్ రవాణాకు వాడుకుంటున్నారని అధికారులు తెలిపారు.

ఈగల్ ఫోర్స్ విజ్ఞప్తి..

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు డ్రగ్స్ దందాపై అప్రమత్తంగా ఉండాలని ఈగల్ ఫోర్స్ అధికారులు సూచించారు. డ్రగ్స్ వినియోగదారులు, పెడ్లర్లు, సరఫరాదారులు, రవాణా నెట్‌ వర్క్‌ ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియచెయ్యాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా పెడతామన్నారు. తగిన రివార్డు ఇస్తామని తెలిపారు. డ్రగ్స్ దందా గురించి తెలిస్తే టోల్-ఫ్రీ నెంబర్ 1908కు తెలియచెయ్యాలాన్నారు. వాట్సాప్ నెంబర్ 87126 71111, వెబ్‌సైట్: https://eagleforce.tspolice.gov.in/, ఈమెయిల్: tsnabho-hyd@tspolice.gov.in కు కూడా సమాచారం ఇవ్వొచ్చని తెలిపారు.

Also Read: చలికాలంలో పక్షుల పండుగ.. దేశంలోని ఈ 10 ప్రదేశాలు మిస్ కావద్దు!

Tags

Related News

వనస్థలిపురంలో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 20 లక్షల నగదు అపహరణ!

సన్నబియ్యం BPT, RNR, సోనా, HMT బియ్యం ధరలు ఫిక్స్ చేసిన ప్రభుత్వం!

కరువు సవాళ్లకు చెక్ పెట్టేలా తెలంగాణ సన్నాహాలు.. ఎల్‌నినోపై మంత్రి ఉత్తమ్ సమీక్ష!

సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్-కారు ఢీకొని తండ్రి, కూతురు మృతి!

చార్జిషీట్ వేయాంటే రూ.2 లక్షలివ్వాల్సిందే.. ఏసీబీ దాడిలో కీసర ఎస్‌ఐ అరెస్ట్!

రాహుల్ గాంధీని అడ్డుకుంటే జరిగేది ఇదే.. ఢిల్లీ నేతలకు విహెచ్ కౌంటర్!

రాజకీయాలు ఎన్నికల వరకే! కరీంనగర్‌లో రూ.4 కోట్ల అర్బన్ పనులకు బండి సంజయ్, పొన్నం శ్రీకారం

Big Stories

Advertisement
×