Rice Price Control: మార్కెట్లో అక్రమాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుంది. బియ్యాన్ని అక్రమంగా దాచినా (హోర్డింగ్), బ్లాక్ మార్కెట్‌కు తరలించినా లేదా కావాలని ధరలు పెంచినా చట్టపరమైన శిక్షలు తప్పవని హెచ్చరించింది. పదేపదే ఇలాంటి తప్పులు చేసే వారిపై ‘పీడీ యాక్ట్’ ప్రయోగించేందుకు కూడా పౌరసరఫరాల శాఖ సిద్ధమవుతోంది. 25 కిలోల బస్తాలపై 26 కిలోల స్టిక్కర్లు వేసి తూకంలో మోసం చేస్తున్న వాళ్లని, అలాగే అసలు MRP ధర కనపడకుండా దానిపైన ఎక్కువ రేటు ఉన్న నకిలీ స్టిక్కర్లు అతికించి అమ్ముతున్న మోసకారి వ్యాపారులను తనిఖీ బృందాలు ఇప్పటికే పట్టుకుంటున్నాయి.
ఒకేసారి ధరలు పెరిగి సామాన్య కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు, ఎక్కువగా వాడే బియ్యం రకాలపై పౌరసరఫరాల శాఖ గరిష్ట ధరలను ఫిక్స్ చేసింది. BPT మరియు KNM బియ్యం గరిష్ట ధర కిలోకు రూ.66 గా నిర్ణయించారు. అలాగే క్వాలిటీ రకాలైన RNR మరియు తెలంగాణ సోనా బియ్యం ధర కిలో రూ.74 కు మించకూడదు. ప్రజలు ఎక్కువగా కొనే HMT మరియు JSR రకాల బియ్యం గరిష్ట ధరను కూడా కిలోకు రూ.79 గా పరిమితం చేశారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ధరలు పెరగకుండా ఒకేలా ఉంటాయి.
అందరికీ ఆహారం అందేలా చూడటానికి, వ్యాపారం న్యాయంగా జరిగేలా చేయడానికి పౌరసరఫరాల శాఖ పూర్తిగా కట్టుబడి ఉంది. కొనుగోలుదారులు మోసపోకుండా ఉండేలా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ, నిత్యావసరాలు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా, సరైన ధరకు దొరికేలా చేస్తోంది.
Also Read: యూసఫ్‌గూడలో చాలా ఆస్తులు సావిత్రి గారివేనా? ప్రేమ్ సాగర్ షాకింగ్ కామెంట్స్!