Abbabba Ga Pori Song: ఈశ్వర్ సాయి,మాధురి రాథోడ్ ల జోడీ కలిసి ఫోక్ ఇండస్ట్రీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశారో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా రాతిరి..రాతిరి ,ప్రమీలా అంటూ వచ్చిన పాటలు నెట్టింట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.అయితే ఇండస్ట్రీలో వీరి జోరు కంటిన్యూ అవుతుండగానే రెడ్డి భవన్ లో వీరిద్దరూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడటం, ఆ తర్వాత ఒకరిపై ఒకఋ కేసులు పెట్టుకోవడం, సూసైడ్ అటెంప్ట్స్ వంటి వరుస సీరియల్ సీన్స్ మనకి తెల్సినవే.
వరుస సాంగ్స్ తో దుమ్ములేపుతున్న మాధురి రాథోడ్ ,ఈశ్వర్ సాయి
అయితే ఆ కేసు సంగతి ఏమైందో తెలీదు కాని, ఆ బ్యాడ్ ఫేజ్ ని పక్కన పెట్టి మళ్ళీ వరుస సాంగ్స్ తో దుమ్ములేపుతున్నారు ఈ ఇద్దరు.ఇక వారిద్దరి కాంబోలో వచ్చిన చాలా పాటల్లాగే ఇపుడు నెట్టింటిని షేక్ చేస్తుంది అబ్బబ్బ గా పోరి అనే ఫోక్ సాంగ్. మాధురి రాథోడ్ , ఈశ్వర్ సాయి కలిసి స్టెప్పులు వేసిన ఈ పాట రిలీజ్ అయిన నాలుగు నెలల్లోనే ఏకంగా 8 మిలియన్ల మంది చూశారంటే ఈ జోడీకి ఎలాంటి క్రేజ్ ఉందో అర్థమవుతుంది.
ఈ రేంజ్ లో జనాల్లోకి దూసుకుపోవడానికి కారణం
ఇక ఈ పాటకి మద్దినేని శ్రీనివాస్ లిరిక్స్ అందించగా తనదైన గొంతుతో పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశాడు జోగుల వెంకటేష్. అయితే ఈ పాట ఈ రేంజ్ లో జనాల్లోకి దూసుకుపోవడానికి కారణం కళ్యాణ్ కీస్ అందించిన మ్యూజిక్ అని చెప్పక తప్పదు,ఇక కళ్యాణ్ కీస్ ఈ మధ్య వరుస సాలిడ్ హిట్స్ తో ఫోక్ ఇండస్ట్రీని ఏలుతున్నాడనే చెప్పాలి.ఇక మను మైకేల్ ఈ పాటకి దర్శత్వం వహించడంతో కోరియోగ్రఫీ చేయడం విశేషం .ఇక ఈ పాటని అల్లేపు ప్రవీణ్ నిర్మించగా కమ్లీ పటేల్ సినిమాటోగ్రఫీ, హరి తోట ఎడిటింగ్ చేసి పాటని నెక్స్ట్ లెవెల్ లో పెట్టేశారు.
బప్పీల హరి మ్యూజిక్ ని రీ క్రియేట్
ఇకపోతే ఈ పాట వింటున్న వాళ్ళంతా ఇది బప్పీల హరి మ్యూజిక్ ని రీ క్రియేట్ చేస్తుందని, పాట ఆ రేంజ్ లో ఉందని కొంతమంది అంటుంటే ,ఇప్పటి వరకు వీరి కాంబోలో వచ్చిన పాటల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ గా నిలిచిపోతుందని ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఫోక్ లవర్స్.ముఖ్యంగా ఈ పాట వినగానే బీట్ అట్రాక్ట్ చేసేలా ఉండటం, మాస్ బీట్ కి క్యాచీ ట్యూన్ పడటంతో ఈజీగా హమ్ చేసేస్తున్నారు ఆడియన్స్.
ALSO READ :జాను లిరి అంటేనే ఫోక్ సాంగ్స్‌కు ఫుల్ జోష్.. ఒక్కో పాటకు కోట్ల వ్యూస్!
మొత్తానికి ఈ ఇద్దరి కాబినేషన్ కి ఉన్న క్రేజ్ ని ప్రూవ్ చేస్తూ మరోసారి నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ పాట వచ్చే రోజుల్లో ఎలాంటి రికార్డులు కొల్లగోడుతుందో, మళ్ళీ వీరి కాంబోలో ఎప్పుడు సాంగ్స్ వస్తాయో వేచి చూడాల్సిందే !