E-Paper
Advertisement

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!

ప్రజావాణి ఫిర్యాదుల స్వీకరణలో కొత్త పద్దతి: గద్వాల్ విజయలక్ష్మి!
Advertisement

Prajavani Token: ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణకు టోకెన్ సిస్టమ్ ను అమలు చేస్తే స్వీకరణం, పరిష్కారం ప్రక్రియల్లో మరింత పారదర్శకత చోటుచేసుకుంటుందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇన్ ఛార్జి గద్వాల్ విజయలక్ష్మి అధికారులకు సూచించారు. సోమవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌ ప్రజావాణికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా తో కలిసి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చే ప్రజలు తమ సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో, నమ్మకంతో వస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు.

ప్రతి ఫిర్యాదుపై..

కేవలం ఆర్జీలను స్వీకరించి, ఆన్‌లైన్‌లో నమోదు చేసి సంబంధిత శాఖలకు పంపించటం వరకే తమ బాధ్యత అని భావించకుండా ప్రతి ఫిర్యాదుపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, పరిష్కారం దిశగా చొరవ చూపాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖలు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని, యాక్షన్ టేకెన్ రిపోర్టులు తెప్పించుకుని వాటి పురోగతిని సమీక్షించాలని సూచించారు. పెండింగ్ అర్జీల పరిష్కారానికి సమస్య తీవ్రత, ప్రాధాన్యత ఆధారంగా గడువులు నిర్ణయించుకోవాలని, తక్షణమే పరిష్కరించగలిగే సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఇతర సమస్యలను వంటి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులతో సమన్వయం..

Advertisement

అనవసర జాప్యాన్ని ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా గృహ నిర్మాణం, విద్యుత్, గృహజ్యోతి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, వివిధ రకాల పింఛన్లు తదితర విభాగాల్లో పెండెన్సీపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని తగ్గించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఆర్జీదారుల పట్ల అధికారులు సున్నితత్వం, సహనం, మానవీయ దృక్పథంతో వ్యవహరించాలన్నారు. సమస్యను చెప్పుకునేందుకు వచ్చే ప్రతి ఒక్కరికీ తగిన సమయం కేటాయించి, వారి వినతులను శ్రద్ధగా వినాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని, తక్షణమే పరిష్కరించగలిగే సమస్యల విషయంలో అక్కడికక్కడే చర్యలు తీసుకునేలా చూడాలన్నారు.

Also read: ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

టోకెన్ విధానం..

Advertisement

ప్రజావాణికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు వస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టి, క్రమబద్ధంగా ఆర్జీల స్వీకరణ చేపట్టాలన్నారు. ప్రజలందరికీ తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కల్పించేలా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహించే ముఖ్యమంత్రి ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహణ, ప్రజలకు కల్పించిన సౌకర్యాల పరిశీలించిన విజయలక్ష్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలాను అభినందించారు.

మొత్తం 333 ఆర్జీల స్వీకరణ

సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ ప్రియాంక ఆలా కలిసి మొత్తం 333 అర్జీలు స్వీకరించారు. వాటిలో గృహ నిర్మాణం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు సంబంధించిన ఆర్జీలు 282 వరకు ఉండగా, ఇతర శాఖలకు సంబంధించి 26, రెవెన్యూ శాఖకు సంబంధించి 25 ఆర్జీలున్నట్లు వెల్లడించారు. దరఖాస్తులు, ఆర్జీల పరిష్కారానికి సత్వరమే పరిశీలన చేసి పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

Also read: ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

Tags

Related News

బౌరంపేటలో అక్రమ గ్యాస్ సిలిండర్ల దందా కలకలం

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!

ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

రేవంత్ రెడ్డి నిస్సహాయతపై ప్రజల్లో ఆగ్రహం.. బాబుకు కవిత కీలక విజ్ఞప్తి

Big Stories

Advertisement
×