Illegal Gas: బౌరంపేట సతీష్ సొసైటీలో సింధు ట్రావెల్స్ కార్యాలయం సమీపంలోని ఓ ప్లాట్‌లో అక్రమ గ్యాస్ నిర్వహణ వ్యవహారాన్ని బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి వెలుగులోకి తెచ్చారు. గత మూడు రోజులుగా అక్కడ అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఆయన సోమవారం ఉదయం ప్లాట్ వద్దకు వెళ్లి గోడపై నుంచి పరిశీలించారు.
అక్కడ సిలిండర్ల మూతలు తెరిచి ఉండటాన్ని గమనించి, అక్కడి వ్యక్తులను నిలదీశారు. దీంతో వారు ఆందోళనకు గురై సమీపంలోని గదిలోకి పరుగులు తీశారు. అనంతరం తిరిగి వచ్చేలోపే 80కి పైగా గ్యాస్ సిలిండర్లను హడావుడిగా ఆటోల్లోకి ఎక్కించి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన కృష్ణారెడ్డి వారిని అడ్డుకుని పట్టుకున్నారు. వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సిలిండర్లతో ఉన్న ఆటోలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో కృష్ణారెడ్డికి ఎల్.యాదయ్యగౌడ్ సహకరించారు. ఇంత పెద్దఎత్తున గ్యాస్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు ? ఈ దందా ఎంతకాలంగా సాగుతోంది ? అలాగే భద్రత కోణాల్లో కూడ పోలీసులు సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.