E-Paper
Advertisement

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!

కోటి ఓట్లు.. 90 సీట్లే మా లక్ష్యం.. టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్!
Advertisement

Samvidhan Rakshak; రాజ్యాంగ పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఈ నెల 26న హైదరాబాద్‌లో భారీ ఎత్తున ‘సంవిధాన్ రక్షక్ ర్యాలీ’ నిర్వహించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. సోమవారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.లిబర్టీ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి ట్యాంక్‌బండ్ సమీపంలోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగవిలువలను కాపాడేందుకు పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

నూతన ఇన్‌ఛార్జి పర్యటన.. కీలక భేటీలు..

రాష్ట్ర కాంగ్రెస్ నూతన ఏఐసీసీ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సందీప్‌కు రాష్ట్ర పార్టీ తరపున ఘన స్వాగతం పలికినట్లు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సందీప్ పర్యటనలో భాగంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), అడ్వైజరీ కమిటీ సమావేశాలు అత్యంత కీలకంగా జరిగాయని వివరించారు.

కోటి ఓట్లు – 90 సీట్లే లక్ష్యం..

Advertisement

ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సమగ్ర వివరణ ఇచ్చారని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన కొనియాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్దేశించిన ‘కోటి ఓట్లు – 90 సీట్లు’ లక్ష్యంతో రాబోయే ఎన్నికలకు సమాయత్తమవుతున్నామని, సమష్టి కృషితో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Also Read: 20 ఏళ్ల పాటు ప్రతి నెలా 30000 విత్‌డ్రా చేసినా అకౌంట్లో 75 లక్షలు… PF ఉన్నోళ్ళకే ఈ గోల్డెన్ ఛాన్స్

Tags

Related News

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!

ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

రేవంత్ రెడ్డి నిస్సహాయతపై ప్రజల్లో ఆగ్రహం.. బాబుకు కవిత కీలక విజ్ఞప్తి

ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే.. రాహుల్‌కు నితిన్ నబీన్ స్ట్రాంగ్ కౌంటర్

మాకో న్యాయం.. వారికో న్యాయమా.. ఆందోళనలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

Big Stories

Advertisement
×