E-Paper
Advertisement

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!

పల్నాడు వాటర్ గ్రిడ్ వెనుక ఉన్న అసలు దొంగలు వీల్లే: చిట్టా విప్పిన సీఎం రేవంత్!
Advertisement

Krishna Water: కృష్ణా నది జలాలను కాంగ్రెస్ ప్రభుత్వం తాకట్టు పెట్టిందని, హక్కులను కాపాడటం లేదని బీఆర్ఎస్ ఇటీవల పదే పదే చెబుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వాదనల కంటే అబద్ధాలను నమ్ముకుని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని ప్రణాళికతో ప్రయత్నం చేస్తోందని అన్నారు. పల్నాడు వాటర్ గ్రిడ్ గురించి హరీష్ రావు, కేటీఆర్ ప్రధానంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే దీనికి కారణమని అర్ధసత్యాలు, అబద్ధాలతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

జీవో నంబర్ 56ను విడుదల..

2004 నుంచి 2006 వరకు వైఎస్ మంత్రివర్గంలో మంత్రులుగా, 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎంగా కేసీఆర్, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు నీటి హక్కులను శాశ్వతంగా ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. కేవలం బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా కూడా వాస్తవాలను పరిశీలించాలని, పల్నాడు వాటర్ గ్రిడ్ పనులను మేం అడ్డుకోలేదన్నట్లుగా చెబుతున్నారని, 2022, ఫిబ్రవరి 16న వైఎస్ జగన్ ఏపీ సీఎంగా, తెలంగాణలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జీవో నంబర్ 56ను విడుదల చేశారు. జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా రూ.1,200 కోట్లతో పల్నాడు, గుంటూరు జిల్లా తాగునీటి కోసం తీసుకున్నారని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ హడావుడి..

Advertisement

కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లతో మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేలా పథకాన్ని తీసుకువచ్చారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవో, అనుమతులపై కృష్ణా బోర్డు దగ్గర కానీ, జల్ జీవన్ మిషన్ దగ్గర కానీ ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని, అనుమతులు ఇచ్చినప్పుడు అభ్యంతరం పెట్టలేదు. కేంద్ర ఆర్థిక సహకారంపై అభ్యంతరం చెప్పలేదు. కానీ ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు మొదలైనట్లు బీఆర్ఎస్ పార్టీ హడావుడి చేస్తోందని అన్నారు. వచ్చే ప్రభుత్వాలు అడ్డుకుంటాయన్న ఉద్దేశంతోనే 2022లోనే జీవో ఇచ్చారని, మా దృష్టికి రాగానే కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని, పనులను ఆపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

Also Read: ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో..

Advertisement

బీఆర్ఎస్ పార్టీ మా చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మా బాధ్యతను ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తూనే ఉంటామని సీఎం అన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులుగా ఉన్నారు. అప్పుడే పోతిరెడ్డిపాడు ను 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచడానికి అనుమతులు ఇచ్చామని నేను సిద్ధిపేటలో చెప్పానని, మార్చి 29, 2005న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్‌లో పోతిరెడ్డిపాడు నుంచి సామర్థ్యాన్ని పెంచి తరలించుకుపోతామని స్పష్టంగా పేర్కొన్నారని అన్నారు. ఆ తర్వాత 13.9.2005న జీవో వచ్చింది. మంత్రులుగా బడ్జెట్‌ను ఆమోదించారని అసెంబ్లీలో నిలదీయలేదని అన్నారు.

మోచేతి నీళ్లు తాగింది మీరు కదా..

జీవో వచ్చినప్పుడు తాము మంత్రులుగా లేమని హరీష్ రావు చెబుతున్నాడు.. కానీ అసెంబ్లీలో చర్చకు వచ్చినప్పుడు వారు మంత్రులుగా ఉన్నారని, ఈ పాపం వాళ్లదే అని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నాయిని నర్సింహారెడ్డి ఆనాడు కడప జిల్లా మంత్రిగా వ్యవహరించారని, కడప జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి మోచేతి నీళ్లు తాగింది మీరు కదా.. కృష్ణా జలాలను వైఎస్‌కు తాకట్టు పెట్టింది మీరు.. రూ.1,250 కోట్లతో పోతిరెడ్డిపాడు సామర్థ్య పెంపునకు అనుమతులు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయినప్పుడు హారతులు ఇచ్చింది హరీష్ రావు.. వార్డు మెంబర్ కాకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆయనను మంత్రిగా చేశారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

శ్రీశైలం డెడ్ స్టోరేజ్..

హరీష్ రావు గురువు వైఎస్ఆర్.. వైఎస్ఆర్‌కు గురుదక్షిణ హరీష్ రావు చెల్లించాడని, శ్రీశైలం వెనుక నుంచి ఏపీకి పోతిరెడ్డిపాడు లేదా మల్యాల లేదా ముచ్చుమర్రి నుంచి నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారని, 2020లో రాయలసీమ లిఫ్ట్‌కు అనుమతులు ఇచ్చారు. తెలంగాణ ప్రాంత నీటి హక్కులకు సమాధి కట్టి హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ వన్ ద్వారా 40 టీఎంసీల నీళ్లను తరలించుకుపోవడానికి జీవో 24-07-2004న ఇచ్చారని, అప్పుడు హరీష్ రావు మంత్రివర్గంలోనే ఉన్నాడని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శ్రీశైలం డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లు తీసుకోవడానికి ముచ్చుమర్రికి అనుమతి ఇచ్చారు. తెలంగాణ నీటి హక్కులను శాశ్వత జలసమాధి చేసింది కేసీఆర్, హరీష్ రావు అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

Also Read: ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే.. రాహుల్‌కు నితిన్ నబీన్ స్ట్రాంగ్ కౌంటర్

రూ.11,255 కోట్లు ఖ‌ర్చు..

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎపీకి 4.47 టీఎంసీలు రోజు తరలించే కెపాసిటీ ఉంటే కేసీఆర్ సీఎం అయ్యాక 13.17 టీఎంసీలు తరలించుకుపోయేలా కొత్త ప్రాజెక్టులు వచ్చాయని అన్నారు. ఒక నదిని పూర్తిగా తరలించుకుపోయేలా ప్రాజెక్టులు కట్టారు. రొయ్యల పులుసు, పంచభక్ష పరమాన్నాలు కేసీఆరే తిని అన్యాయం చేశాడు. కేసీఆర్ సీఎం అయ్యాక రాయలసీమలో 8 ప్రాజెక్టులను నిర్మించారు. వాయువేగంతో పూర్తి చేశారు. కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదు. దీని వల్ల పూర్తిగా నష్టపోయాం అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ హయాంలో భూసేకరణపై 2014 నుంచి అక్టోబర్ 2023 వరకు రూ.11,255 కోట్లు ఖ‌ర్చు చేశారు. ఏడాదికి స‌గ‌టున‌ రూ.1,187 కోట్ల మాత్ర‌మే ఖర్చు చేశారని అన్నారు.

బరితెగించి నీళ్లిచ్చారు..

మా ప్రభుత్వం ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించామని, మా ప్రభుత్వం రూ.3,518 కోట్లను భూసేకరణపై ఖర్చు చేసింది. రూ.1,256 కోట్లను సగటున ఏడాదికి ఖర్చు చేశామని, రూ.600 కోట్లను ఉద్దండాపూర్ రిజర్వాయర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కోసం ఖర్చు చేశామని, ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ముంపు బాధితులను తరలించాలని, భూసేకరణ చేయాలని కేసీఆర్ ఆలోచించలేదని అన్నారు. రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యేవి.. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బరితెగించి నీళ్లు తరలించుకుపోయే అవకాశం ఉండేది కాదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అబద్దాలు ప్రచారం..

ఆంధ్రప్రదేశ్ జలదోపిడీకి కారణం కేసీఆర్.. టన్నుల కొద్దీ అబద్ధాలను సంచుల్లో వేసుకుని ఊర్లలో కేటీఆర్, హరీష్ రావు వెదజల్లి వస్తున్నారు. వైఎస్ జగన్‌ను ప్రగతి భవన్‌కు పిలిచి విందు భోజనం పెట్టిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ వచ్చిందని, కేసీఆర్ మంచి మనిషి.. గోదావరి నీళ్లను శ్రీశైలం వరకు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చారని జగన్ చెప్పారని, ఎంపీగా గెలిస్తే మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు. 797 ఎఫ్‌ఆర్‌ఎల్ లెవల్‌లో రాయలసీమ లిఫ్ట్ నుంచి నీళ్లు తీసుకుపోయేందుకు అనుమతి ఇచ్చారు. నీళ్లు కాదు బురద కూడా దీని ద్వారా తీసుకుపోవచ్చు. జగన్‌ను పిలిచి హారతి పట్టి కృష్ణా జలాలను సమర్పయామి చేసింది కేసీఆర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వం చట్టానికి లోబడి సంబంధిత వ్యవస్థల్లో ఫిర్యాదు చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది.

Also Read: ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

Tags

Related News

ఆపరేషన్ కగార్ జరిగినా నేటికీ లొంగని మావోయిస్టులు.. ఎవరో తెలుసా..?

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!

ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

రేవంత్ రెడ్డి నిస్సహాయతపై ప్రజల్లో ఆగ్రహం.. బాబుకు కవిత కీలక విజ్ఞప్తి

ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే.. రాహుల్‌కు నితిన్ నబీన్ స్ట్రాంగ్ కౌంటర్

మాకో న్యాయం.. వారికో న్యాయమా.. ఆందోళనలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేయండి.. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

Big Stories

Advertisement
×