E-Paper
Advertisement

Hyderabad News: హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీసు కమిషనరేట్లు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్

Hyderabad News: హైదరాబాద్ సిటీలో నాలుగు పోలీసు కమిషనరేట్లు.. కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్
Advertisement

Hyderabad News: దేశంలో అతి పెద్ద నగరంగా హైదరాబాద్‌ సిటీ రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో పోలీసు వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పుటి వరకున్న మూడు పోలీస్ కమిషనరేట్లు పునర్వ్యవస్థీకరించింది. కొత్తగా ఫ్యూచర్ సిటీని నాలుగో కమిషనరేట్‌‌గా ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు నియమించింది. రాచకొండ కమిషనరేట్ కొత్తగా మల్కాజ్‌గిరి కమిషనరేట్‌గా పేరు మారింది. మల్కాజ్‌గిరి కమిషనరేట్‌కు అవినాష్ మొహంతికి బాధ్యతలు అప్పగించింది.

నాలుగు పోలీసు కమిషనరేట్లగా హైదరాబాద్ సిటీ

Advertisement

గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పోలీసు కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ పూర్తి అయ్యింది. ఇప్పటివరకు మూడు పోలీస్ కమిషనరేట్లు ఉండగా, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం రాత్రి ప్రభుత్వం జారీ చేసింది. దీంతో హైదరాబాద్ కమిషనరేట్ పరిమాణంలో పెద్దదిగా మారింది. అధికార పరిధిని శంషాబాద్ విమానాశ్రయం, బుద్వేల్‌లో నిర్మిస్తున్న హైకోర్టు సముదాయం వరకు విస్తరించినట్లయ్యింది.

సైబరాబాద్ కమిషనరేట్ ఐటీ జోన్, దాని పొరుగు ప్రాంతాలకే పరిమితం అయ్యింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ ప్రాంతం గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌ రామ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, పటాన్‌చెరు, జీనోమ్ వ్యాలీ, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం పోలీస్, ప్రొవిజనింగ్- లాజిస్టిక్స్ ఇన్స్పెక్టర్ జనరల్ డాక్టర్ ఎం. రమేష్‌రెడ్డిని సైబరాబాద్ కమిషనర్‌గా నియమించింది ప్రభుత్వం.

Advertisement

కొత్త ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు

కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి భారత్ ఫ్యూచర్ సిటీ, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, మరికొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్‌ కార్యాలయం ఏర్పాటు కానుంది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యకలాపాలు జోరుగా పెరగనున్నాయి. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు ఈ ప్రాంతానికి తరలివస్తాయని అంచనా వేసిన  ప్రభుత్వం, ఫ్యూచర్‌ సిటీలో శాంతిభద్రతలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని ప్రత్యేక కమిషనరేట్‌గా మార్చడం, కమిషనర్‌ని నియమించడం చకచకా జరిగిపోయింది.

ALSO READ: మూడు నిమిషాల్లో షాకిచ్చిన కేసీఆర్

ఇక రాచకొండ కమిషనరేట్‌ విషయానికి వద్దాం. దీన్ని కూడా పునర్ వ్యవస్థీకరించింది. రాచకొండ పేరు మార్చి మల్కాజ్‌గిరి పోలీసు కమిషనరేట్ గా మార్చింది. ఇందులోకి కీసర, శామీర్ పేట, కుత్భుల్లాపూర్,  కొంపల్లి వంటి ప్రాంతాలు వస్తాయి. రాచకొండ పరిధిలో ఉన్న భువనగిరిని ప్రత్యేక పోలీస్ యూనిట్ గా ఏర్పాటు చేసింది. ఆ జిల్లాకు అక్షాంష్ యాదవ్‌ని ఎస్పీగా నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. 12 జోన్లు, 60 సర్కిల్‌లతో 2,000 చదరపు కిలోమీటరు రూపాంతరం చెందింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీని 300 వార్డులు చేయనుంది. దీనికి సంబంధించి బిల్లును ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టనుంది.

 

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×