E-Paper
Advertisement

Water Misuse: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. తాగునీటిని వృథా చేస్తే జరిమానే!

Water Misuse: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. తాగునీటిని వృథా చేస్తే జరిమానే!
Advertisement

Water Misuse: మహానగర వాసుల దాహర్తిని తీర్చేందుకు జలమండలి సరఫరా చేస్తున్న తాగు నీటిని వృథా చేసినా ఇతర అవసరాలకు ఉపయోగించినా ఇకపై జరిమానాలు చెల్లించాల్సిందే. ఇటీవల ప్రజల నుండి వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చిన సమాచారం మేరకు జలమండలి అధికారులు రంగంలోకి దిగారు. నివాస, వాణిజ్య ప్రాంగణాల్లో ఫ్లోర్లు, సెల్లార్లు, ఓపెన్ ఏరియాలను కడగడానికి త్రాగునీటిని వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

తాజాగా వాట్సాప్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌లోని ఓ ఇంటి వద్ద జలమండలి అధికారులు తనిఖీ చేపట్టారు. ఇంటి ఫ్లోర్ ను తాగునీటితో కడుగుతూ దుర్వినియోగం చేయడాన్ని గుర్తించారు. దీంతో నిబంధనలు ఉల్లంఘించినందుకు బాధ్యులకు రూ.5 వేల జరిమానా విధించారు. ఇకపై ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Advertisement

Also Read: GHMC: దోమలపై దండోరా.. క్లీన్ సిటీగా హైదరాబాద్.. జీహెచ్ఎంసీ కమిషనర్ దూకుడు!

జ‌ల‌మండ‌లికి తాగునీటి వృథాపై ఫిర్యాదులు అందుతున్నాయని అధికారులు తెలిపారు. క‌స్ట‌మ‌ర్ కేర్ కు ఫోన్ చేయ‌డంతో పాటు ఆయా ప్రాంతాల్లో నేరుగా అధికారుల‌కు ఫిర్యాదులు చేస్తున్నారని వెల్లడించారు. దీంతో జీఎంలు త‌మ ప‌రిధిలో తాగు నీరు స‌ర‌ఫ‌రా చేసే స‌మ‌యంలో త‌మ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో త‌నిఖీలు చేయిస్తున్నట్లు తెలిపారు. ఎవ‌రైనా తాగునీటిని వృథా చేసిన‌ట్లు తేలితే వెంట‌నే నోటీసులు జారీ చేసి జ‌రిమానా విధిస్తున్నామని తెలిపారు. తాగునీటి దుర్వినియోగంపై ఫిర్యాదులు చేయాలనుకునే వారు వాట్సాప్ నెంబర్ 99499 30003, మెట్రో కస్టమర్ కేర్ టోల్ ఫ్రీ నెంబర్ 155313 ద్వారా సమాచారం అందించవచ్చునని అధికారులు సూచించారు.

Advertisement

Also Read: YS Jagan: కొడుకు అట్లా.. బావమరిది ఇట్లా, ఇది రాష్ట్రంలో పాలన: వైఎస్ జగన్

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×