Jay Shah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) కంటే ముందు సన్ రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad) ఓనర్ కావ్య మారన్ ( kavya maran ) వివాదంలో చిక్కుకున్నారు. ది హండ్రెడ్ లీగ్ వేలం ( The Hundred league ) తాజాగా లండన్ లో జరగగా.. ఈ సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు కావ్య పాప. ఈ టోర్నమెంటులో కావ్య పాపకు సంబంధించిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు కూడా ప్రాతినిధ్యం వహిస్తారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( abrar ahmed ) కొనుగోలు చేసి వివాదానికి తెరలేపింది కావ్య పాప. ఈ క్రమంలో కావ్య పాప పై దారుణంగా పోస్టులు పెడుతున్నారు ఇండియన్ క్రికెట్ అభిమానులు. ఆమెపై దేశ ద్రోహి ముద్ర వేస్తున్నారు. అయితే తాజాగా ఇదే వివాదంపై ఐసీసీ బాస్ జై షా ( Jay Shah ) కూడా స్పందించినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. వెంటనే పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను వదిలించుకోవాలని కావ్య పాపకు ఐసీసీ బాస్ జై షా వార్నింగ్ ఇచ్చాడని జోరుగా ప్రచారం అందుకుంది. ఈ మేరకు పోస్టులు వైరల్ అవుతున్నాయి.
Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓటమిపై పాక్ ప్రధాని సీరియస్ !
ది హండ్రెడ్ లీగ్ వేలం సందర్భంగా పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేయడంపై కావ్య పాప విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ అంశంపై తాజాగా ఐసీసీ బాస్ జై షా కూడా స్పందించినట్లు పోస్టులు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను తెలిసో తెలియక కొనుగోలు చేశావు… ఇప్పటికైనా వాడిని వదిలించుకో.. లేకపోతే యాక్షన్ తప్పదని జై షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ తమ ఆదేశాలను పరిగణలోకి తీసుకోకపోతే, సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన బ్యాన్ విధిస్తామని జై షా హెచ్చరించాడని తెలుస్తోంది. వెంటనే అబ్రార్ అహ్మద్ ను వదిలించుకోవాలని పేర్కొన్నారట.
లేకపోతే భారత క్రికెట్ నియంత్రణ మండలితో సంప్రదించి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఐసిసి బాస్ జై షా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐసీసీ బాస్ జై షా చెప్పినట్లుగానే బీసీసీఐ కూడా నడుచుకుంటుంది అన్న సంగతి తెలిసిందే. ఒకవేళ జై షా మాట వినకపోతే కావ్య పాప కష్టాల్లో పడడం గ్యారంటీ అంటున్నారు. అయితే జై షా స్పందించడం అంత ఫేక్ అని.. ఈ విషయంలో ఆయన స్పందించాడనడం తప్పుడు ప్రచారమని కొంతమంది చెబుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాపకు ఎలాంటి ఆదేశాలు ఆయన ఇవ్వలేదని చెబుతున్నారు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ఇక అటు కావ్య పాప తీసుకున్న నిర్ణయంపై బీసీసీఐ క్లీన్ చీట్ కూడా ఇచ్చింది. విదేశీ టోర్నమెంట్స్ లో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేసుకుంటే తామేమి చేయలేమని చేతులు దులుపుకుంది బీసీసీఐ.
https://www.facebook.com/share/p/1CYSRp3xvD/