E-Paper
Advertisement

MP CV Shanmugam: నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా? ఎంపీ అనుచిత వ్యాఖ్యలు

MP CV Shanmugam: నాకు నయనతార కావాలని అడిగితే నెరవేరుస్తారా? ఎంపీ అనుచిత వ్యాఖ్యలు
Advertisement

MP CV Shanmugam: ప్రముఖ నటి నయనతారపై అన్నాడీఎంకే రాజ్యసభ ఎంపీ సి.వి. షణ్ముగం చేసిన అనుచిత వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మహిళల భద్రత కోసం ఎన్డీయే కూటమి నిర్వహించిన నిరసన కార్యక్రమంలోనే ఆయన మహిళా నటిని ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడటం గమనార్హం. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రభుత్వ విధానాలను విమర్శించే క్రమంలో నయనతార ప్రస్తావన తీసుకురావడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. “మీ కలలను మాకు చెప్పండి.. వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది” అని హామీ ఇచ్చారు. ఈ హామీని ఎద్దేవా చేస్తూ మంగళవారం విల్లుపురంలో జరిగిన నిరసనలో ఎంపీ షణ్ముగం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ కలాం మనల్ని కలలు కనమన్నారు.. కానీ ఈయన (స్టాలిన్) మీ కలలను తనతో పంచుకోమని అడుగుతున్నారు. ఒకవేళ నాకు నయనతార కావాలని అడిగితే ఆయన నెరవేరుస్తారా? ఆమెను పెళ్లి చేసుకోవాలనే కల ఎవరికైనా ఉంటే తీరుస్తారా? అంటూ అనుచితంగా వ్యాఖ్యానించారు.

Advertisement

షణ్ముగం వ్యాఖ్యలపై అధికార డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. రాజకీయ విధానాలను విమర్శించే హక్కు ఎవరికైనా ఉంటుందని కానీ మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. నయనతార వంటి నటిని అవమానించడం అంటే మహిళా లోకాన్నంతటినీ కించపరచడమేనని డీఎంకే నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మహిళల గురించి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేసిన ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎంపీ షణ్ముగం ఇలా వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నెపంతో మహిళా నాయకులను నటీమణులను ప్రస్తావించి విమర్శల పాలయ్యారు. ఒకవైపు మహిళా భద్రత గురించి నిరసనలు తెలుపుతూనే మరోవైపు మహిళా నటిని కించపరిచేలా మాట్లాడటం ఆయన ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై అటు సినీ పరిశ్రమ ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ ఇంకా కొనసాగుతోంది.

Advertisement

Read Also: Street Lights: ఢిల్లీ తరహాలో స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్… టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Related News

అయోధ్య రామమందిరం కేసులో సంచలనం.. 105 సార్లు విరాళాల చోరీ.. బయటపెట్టిన సిట్!

యువతి యువకుడిపై దాడి.. అసభ్యకరంగా మాటలు, బీహార్‌లో ఘటన, వీడియో వైరల్

చచ్చిపోయిన లండన్‌కు సీఎం విజయ్ ఎందుకు.. మధురై వెళ్లాలని అన్నామలై ఘాటు వ్యాఖ్యలు

భూ కేసులో హేమంత్ సోరెన్‌కు షాక్.. నేడు PMLA కోర్టులో కీలక విచారణ!

రైతులను నెలకు రూ.3 వేలు పెన్షన్.. ఆ స్కీమ్ గురించి తెలుసా, వెంటనే అప్లై చేయండి?

రోడ్డుపై BMW బీభత్సం, స్పాట్‌లో ముగ్గురు మృతి, ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం

లాల్‌బాగ్ గణేష్ మండపం వద్ద ఘోర విషాదం.. చిన్నారితో సహా ఇద్దరు భక్తులు దుర్మరణం

భార్య ప్రైవేట్ పార్ట్స్ కొరికితే.. భర్త ముక్కు కొరికేశాడు, యూపీలో విచిత్రమైన ఘటన

Big Stories

Advertisement
×