E-Paper
Advertisement

సుప్రీంకోర్టులో కలకలం.. కోర్టు హాల్‌లోనే బోరుమన్న హైదరాబాద్ మహిళ!

సుప్రీంకోర్టులో కలకలం.. కోర్టు హాల్‌లోనే బోరుమన్న హైదరాబాద్ మహిళ!
Advertisement

Supreme Court: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ముందు హైదరాబాద్ కు చెందిన మహిళ కన్నీటి పర్యంతమయ్యారు. పదిహేనేళ్లుగా నరకం అనుభవిస్తున్నానని.. పిల్లలకు తిండిపెట్టి చదివించుకోలేని దీనస్థితిలో ఉన్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సహారా గ్రూప్​ ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన కేసులో తన వాదనలు తానే వినిపించుకుంటా అని చెప్పిన ఆమె మెన్షన్​ సమయంలో ఒక్కసారిగా విలపించటం కలకలం రేపింది. ఒక మహిళకు మంగళసూత్రంకన్నా ఏదీ ముఖ్యం కాదు.. నేను ధరించానో చూడండి అంటూ తన మెడలోని మంగళసూత్రాన్ని ప్రధాన న్యాయమూర్తికి ఆమె చూపించింది.

మహిళ ఆవేదనపై స్పందించిన జస్టిస్​ సూర్యకాంత్​.. సుప్రీంకోర్టుకు రావటానికి ప్రయాణ ఖర్చులు వృధా చేసుకోవద్దని సూచించారు. ఆన్​ లైన్​ లో హాజరు కండి అని విజ్ఞప్తి చేశారు. ఎంతసేపైనా వాదనలు వింటామని.. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే నిర్ణయం ఉంటుందని చెప్పారు. అయితే ఈ సూచనను ఆ మహిళ సున్నితంగా తిరస్కరించారు. తన జీవితం కంటే ఏదీ ముఖ్యం కాదని.. తదుపరి విచారణకు స్వయంగా వస్తానని చెప్పారు.

Advertisement

Also Read: సముద్రపు సొరచేపలు.. టెక్నాలజీకి గొప్ప వరం.. ఈ ఆవిష్కరణలు చూస్తే మైండ్ బ్లాకే!

దాంతో వచ్చే వారం ఈ కేసు విచారణ కోసం ఓ ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయనున్నట్టు సీజే ప్రకటించారు. ఆ రోజున బోర్డు జాబితాలో ఈ కేసును మొదటి వరుసలో పెడతామన్నారు. ప్రత్యేక ధర్మాసనమే కేసు విచారణ జరుపుతుందని బాధిత మహిళకు భరోసా ఇచ్చారు.

Advertisement

Also Read: Whatsappలో కొత్త ఫీచర్.. ఇక మీ భార్య చేతిలో తన్నులు తినక్కర్లేదు!

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×