E-Paper
Advertisement

లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి పోలీసులు.. అసలేం జరిగిందంటే?

లూలూ మాల్‌లో గన్ కలకలం.. రంగంలోకి  పోలీసులు.. అసలేం జరిగిందంటే?
Advertisement

Lulu Mall: హైదరాబాద్​ KPHBలోని లూలూ మాల్ లో గన్​ కలకలం రేగింది. పార్కింగ్​ ప్రాంతంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన వివాదంలో ఓ వ్యక్తి గన్​ చూపించి బెదిరించటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లిన పోలీసులు.. పరిస్థితిని చక్కదిద్దారు. పాతబస్తీకి చెందిన సిద్దిఖీ అనే వ్యక్తి నుంచి గన్​ ను స్వాధీనం చేసుకున్నారు.

లూలూ మాల్ పార్కింగ్ ప్లేస్ లో వాహనాలను నిలిపే విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. దాంతో సిద్దిఖీ తన వద్ద ఉన్న గన్​ ను చూపించి అవతలివారిని బెదిరించాడు. సమాచారం రాగానే సీఐ రాజశేఖర్​ రెడ్డి అక్కడికి చేరుకుని ఆ గన్​ ను స్వాధీనం చేసుకున్నారు. సిద్దిఖీని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. దీంట్లో సిద్దిఖీ వద్ద ఉన్న గన్‌కు లైసెన్స్ ఉన్నట్లు తేలింది.

Advertisement

Also Read: సుప్రీంకోర్టులో కలకలం.. కోర్టు హాల్‌లోనే బోరుమన్న హైదరాబాద్ మహిళ!

Advertisement

అయితే, సిద్దిఖీ తుపాకీతో ఆ మాల్‌లోకి ప్రవేశించడం ఎలా సాధ్యమైందనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. మాల్ ప్రవేశ ద్వారం వద్ద భద్రతా సిబ్బంది సరైన తనిఖీలు నిర్వహించకపోవడం వల్లే గన్‌తో సదరు వ్యక్తి లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. సాధారణంగా మాల్స్‌లో మెటల్ డిటెక్టర్లు, బ్యాగ్ స్కానింగ్ వంటి భద్రతా చర్యలు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. దీంట్లో నిర్లక్ష్యం వహించినందుకు పోలీసులు లూలూ మాల్ పై కేసులు నమోదు చేశారు.

Also Read: అయ్యబాబోయ్ ఇదేం అరాచకం… చీమల్లా దూరి చికాకు పెట్టే చిట్టి మనుషులు

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×