E-Paper
Advertisement

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?

Bigg Boss Telugu 10: నామినేషన్లో 8 మంది.. ఎలిమినేట్ ఎవరంటే..?
Advertisement

Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న షోలలో టాప్ రియాల్టీ షో అంటే టక్కున గుర్తుకు వచ్చేది బిగ్ బాస్. ఈ షో గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పటికే 9 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు పదో సీజన్ ని కొనసాగిస్తుంది. ఇప్పటికే దాదాపు నెల పూర్తి చేసుకున్న ఈ షో నుంచి ఎంతోమంది ఎలిమినేట్ అయ్యారు. గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ కాస్త కొత్తగా అనిపించినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదన్న టాక్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ మధ్య ఎలిమినేట్ విషయంలో పెద్ద చర్చ నడుస్తుంది.. తాజాగా ఈవారం ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరి నామినేషన్ లో ఉన్న ఆ ఎనిమిది మంది ఎవరు ఈసారి ఎవరు బయటకు వెళ్లే అవకాశం ఉంది అన్నది ఒకసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

నామినేషన్లో 8 మంది.. 

బిగ్ బాస్ సీజన్ 10 లో నామినేషన్ల పర్వం రోజురోజుకీ రసవత్తరంగా మారుతుంది. గ్రీన్ జోన్ సభ్యుల చేతిలో ఉన్న ప్రత్యేక అధికారాలతో హౌస్‌లో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.. దాంతో నామినేషన్ లకు కూడా అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రసారమవుతున్న ఎపిసోడ్లను చూస్తే నామినేషన్ లో ఉన్న ఎనిమిది మందిలో ఇద్దరు బయటికి వెళ్లే అవకాశం ఉంది అని ఓ వార్త ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. మరి నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ల లిస్టు ఒకసారి చూస్తే.. శివ వచ్చి సుధీర్, వంశీలను నామినేట్ చేయగా..జడ్జీలు సుధీర్ నామినేషన్‌ను ఫైనల్ చేశారు. ఆ తర్వాత రామ్‌ప్రసాద్ శివ మరియు శ్వేతలను నామినేట్ చేయగా.. టీం లో నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని నామినేట్ చేసే ఛాన్స్ వస్తుంది.. ఫైనల్ గా నామినేషన్ లో ఉన్న కంటెంట్ లిస్ట్ చూస్తే.. ఝాన్సీ, రోహిత్, రామకృష్ణ, సుధీర్, రామ్ ప్రసాద్, వర్షిణి, శివ, వంశీ వీరంతా నామినేషన్లో ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..

వర్షిణి ఎలిమినేట్..? 

Advertisement

ప్రస్తుతం బిగ్ బాస్ లో టాప్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్న వారిలో కంటే కాంట్రవర్సీతో కొనసాగుతున్న వారిలోనే ఎక్కువ మంది నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో వర్షిని ఒకరు. వర్షినికి ఓటింగ్ కాస్త తగ్గడంతో ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. ఒకవేళ వర్షిని గనక ఎలిమినేట్ అయిపోతే ముఖేష్ పరిస్థితి ఏంటి అన్నది కాస్త గందరగోళంగా మారింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వారిలో వర్షినితో లవ్ ట్రాక్ హైలెట్గా నిలుస్తుంది.. ఈమె గనుక వెళ్ళిపోతే నెక్స్ట్ ఏ జోడి హైలెట్ అవుతుంది అన్నది ప్రస్తుతం జనాల్లో వినిపిస్తుందా ప్రశ్న. మరి వర్షిని నిజంగానే ఎలిమినేట్ అవుతుందా లేదా అన్నది ఈ వీకెండ్ తెలిసిపోతుంది. అప్పటివరకు మిస్ అవ్వకుండా బిగ్ బాస్ ని చూసేయండి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Related News

Gundeninda Gudigantalu TRP Rating : ‘గుండెనిండా గుడిగంటలు’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Intinti Ramayanam Meenaakshi : మీనాక్షి ఒక్కరోజు రెమ్యూనరేషన్ అంతా..?

Ye Devi Varamo Neevu: అంజలి నెలకు అంత సంపాదిస్తుందా..?

Gundeninda GudiGantalu Today episode: బాలుకు దిమ్మతిరిగే షాక్.. శోభా, చింతామణి కలిసిపోయారు.. గుణ అవుట్..

Karthika Deepam 2 Serial Today Episode October 28th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ రూంలోకి వెళ్లిన జ్యోత్స్న షాక్ అవ్వడానికి కారణం ఏంటి..? 

Podarillu Today Episode : కన్నాపై మహా సీరియస్.. పాపం మనీష.. నిజం తెలిసిపోతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: భద్ర ప్లాన్ సక్సెస్.. అడ్డంగా దొరికిపోయిన సాగర్.. వల్లికి విడాకులు..?

Big Stories

Advertisement
×