BigTV English

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ సర్కార్ అనుక్షణం కేసీఆర్ జపం చేస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. వరదలు వస్తే రాష్ట్రాన్ని ఆదుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఆమె వ్యాఖ్యానించారు.


కేసీఆర్ అంటే ఇది..

‘బీఆర్ఎస్ హయాం సమయంలో మేము ఎంపీలుగా ఉన్నప్పుడు ఆరు నెలల ముందు యూరియా కోసం కేసీఆర్ మమ్మల్ని అలెర్ట్ చేసేవారు. కాళేశ్వరం లాంటి తరగని ఆస్తిలో మేడిగడ్డ అనేది చిన్న పార్ట్. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడం కోసం ఆరు, ఏడు నెలలు రీసెర్చ్ చేశారు. కేసీఆర్ కు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఏమీ ఉండదు. కొందరు నేతలు కేసీఆర్ పై ఆబండాలు వేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును 200 ఏళ్లు ప్రజలు గుర్తు ఉంచుకుంటారు’ అని కవిత చెప్పారు.


దేవుడి లాంటి మా నాన్నపై..?.. కవిత ఎమోషనల్

‘ఇప్పటకైనా కేసీఆర్ కు అవినీతి మరక ఎలా వచ్చిందో.. బీఆర్ఎస్ శ్రేణులు ఆలోచించాలి.. కేసీఆర్ పక్కన ఉన్న వాళ్ళ వల్ల అవినీతి మరక అంటింది. కేసీఆర్ కు అవినీతి మరక అంటించడంలో హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు, మెగా కృష్ణారెడ్డి
పాత్ర ఉంది. కొంత మంది దుర్మార్గులం వల్ల బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది. కొందరి వల్లే దేవుడు లాంటి మా నాన్న బద్నాం అయ్యే పరిస్థితి వచ్చింది’ అని కవిత ఎమోషనల్ అయ్యారు.

నాది కేసీఆర్ బ్లడ్..

‘కేసీఆర్ ను నేడు రేవంత్ రెడ్డి విమర్శించే పరిస్థితి వచ్చింది. నాపై హరీష్ రావు, సంతోష్ రావు ఎన్ని కుట్రలు చేసినా భరించాను. కొన్ని రోజుల నుంచి కొందరు నరకం చూపిస్తున్నారు.  హరీష్ రావు, సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు. దగ్గర ఉండి అవినీతి అనకొండలు కేసీఆర్ ను బాద్నాం చేస్తున్నారు. నా వెనుక బీజేపీ ఉంది.. కాంగ్రెస్ ఉంది అని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.. నాది కేసీఆర్ బ్లడ్. నేను ఇండిపెండెంట్ గా వుంటాను.. కేసీఆర్ లాంటి మహానేతపై సీబీఐ విచారణ చేసే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ పై సీబీఐ విచారణ చేసే పరిస్థతి వచ్చింది అంటే పార్టీ ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

నా పై ట్రోల్ చేస్తే తోలు తీస్తా..

‘నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా.. కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోంది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్ లో ఫోటో రాదు. నేను డైరెక్ట్ గా పేర్లు చెప్పిన వారిపై విచారణ చేయండి. మీకు, మీకు ఒప్పందాలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేము బీహార్ వెళ్లి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం.. సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’ అని కవిత తెలిపారు.

ALSO READ: Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

Related News

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

Big Stories

×