BigTV English

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Kavitha: ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి అనకొండ హరీష్ రావే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు దుర్మార్గుల వల్లే బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. హరీష్ రావు, సంతోష్ రావు లాంటి అవినీతిపరులు వల్లే కేసీఆర్ ఈరోజు బద్నాం అవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే.. కవిత ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే బీఆర్ఎస్ పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది.


హరీష్ రావు ఆరడుగుల బుల్లెట్.. 

ఎమ్మెల్సీ కవిత చేసిన సంచలన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యింది. చెప్పకనే చెప్పకుండా.. కవిత గట్టి కౌంటరే వేసింది. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్విట్టర్ వేదికగా హరీష్ రావు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను పోస్ట్ చేసింది. హరీష్ రావు ఓ ఆరడుగుల బుల్లెట్ అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు పొలిటికల్ గా ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ALSO READ: Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

ఎర్రవల్లి ఫాం హౌస్‌కు బీఆర్ఎస్ సీనియర్ నేతలు..

కవిత హాట్ కామెంట్స్ అనంతరం గులాబీ బాస్, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవల్లి ఫాం హౌస్ కు బీఆర్ఎస్ నేతలు క్యూకట్టారు. ప్రస్తుతం కేసీఆర్‌ తో‌ మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు మధుసూదనాచారీ, పల్లా రాజేశ్వరరరెడ్డి సమావేశమైనట్లు తెలుస్తోంది.

ALSO READ: MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

పార్టీ నుంచి కవిత సస్పెండ్..!

కవిత సంచలన వ్యాఖ్యలు చేసి దృష్ట్యా ఆమె వెంటనే చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇప్పటికే కవిత పీఆర్‌వో ను పార్టీ వాట్సాప్ గ్రూప్ నుంచి తొలిగించారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అన్ ఫాల్లో చేస్తున్నారు. కవిత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఆమెను పార్టీలో నుంచి సస్పెండ్ చేయాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు.

Related News

Bathukamma Festival: గిన్నిస్ బుక్ లోకి బతుకమ్మ..! ఆ ఆలోచన తనకు రాలేదని కవితమ్మ బాధ

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

Big Stories

×