BigTV English

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

MLC Kavitha: బీఆర్‌ఎస్‌లో ఆ ఇద్దరు అవినీతి అనకొండలు.. కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు..

MLC Kavitha: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎమ్మెల్సీ కవిత హాట్ కామెంట్స్ చేశారు.. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కు మరకలంటించండంలో హరీష్ రావు, మేఘా కృష్ణారెడ్డి, మాజీ రాజ్యసభ ఎంపీ పాత్ర ఉందని ఆమె వ్యాఖ్యానించారు.


ఆ ఇద్దరు, ముగ్గురు వల్లే ఇదంతా..?

‘కేసీఆర్ మీద మరకలు రావడానికి ఇద్దరు, ముగ్గురే కారణం.. కోట్ల రూపాయలు సంపాదించిన ఇంజినీర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలి. హరీష్ రావు, సంతోష్ రావు, మెగా కృష్ణా రెడ్డి వల్లే కేసీఆర్ ఇన్ని మాటలు పడుతున్నారు. నా మీద కూడా అనేక ఆరోపణలు చేశారు. కానీ నేను వాటిని తట్టుకుని నిలబడ్డాను. హరీష్ రావు, సంతోష్ లు అవినీతి అనకొండలు. కేసీఆర్ చుట్టూ అవినీతి అనకొండలు చేరి మరకలంటిస్తున్నారు’ అని ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు.


హరీష్, సంతోష్ వెనకాల సీఎం రేవంత్..?

‘హరీష్ రావుకు, సంతోష్ రావుకు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ ముఠాకు చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. వాటిల్లో అనేక రకాలుగా నా పైన కూడా మాటలు మాట్లాడించారు. కేసీఆర్ మీద సీబీఐ విచారణ జరిగితే తెలంగాణ రాష్ట్ర పరువు పోతుంది. కేసీఆర్ మీద అనేక ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోం తోలు తీస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు కేసును పీసీ ఘోష్ కమీషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించినప్పుడు బీఆర్ఎస్ ఎందుకు తెలంగాణ అంత బంద్ చెయ్యలేదు’ అని వ్యాఖ్యానించారు.

ఆ దమ్ము కాంగ్రెస్ కు లేదు..!

నేను ఎవరో చెప్తే ఆడే తోలు బొమ్మను కాదు. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలకు వెళ్ళే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వం కు లేదు. బీహార్ లో ఎన్నికలు అవుతున్నాయి. ఆయనకు పీఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇంత నయవంచన చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లనే చేస్తే మేము తెలంగాణ జాగృతి తరుపున వెల్లి బిహర్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన కేసీఆర్ కడిగిన ముత్యం లాగ బయటికి వస్తారు’ అని కవిత పేర్కొన్నారు.

పార్టీ ఉంటే ఎంత.. పోతే ఎంత..?

ఇద్దరి ఇరిగేషన్ అధికారుల వద్ద వందల కోట్లు దొరికాయి. అధికారుల వెనుక ఎవరున్నారో దర్యాప్తు చేయండి.. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర లేదా..? అందుకే హరీష్ ను ఇరిగేషన్ మంత్రిగా తొలగించారు.. వాళ్ల స్వార్థం కోసమే అవనీతికి పాల్పడ్డారు.. కేసీఆర్ పై సీబీఐ కేసుల దాకా వచ్చాక పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత?’ అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు..

ALSO READ: Indian Navy: ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.63వేల జీతం.. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు

Related News

Kavitha: పార్టీ నుంచి కవిత సస్పెండ్..! ఇప్పటికే ట్విట్టర్‌లో బీఆర్ఎస్ గట్టి కౌంటర్, ఇక మిగిలింది అదేనా..?

Kavitha: నాపై ట్రోల్ చేస్తే తోలు తీస్తా బిడ్డా.. కొందరు నరకం చూపించినా..?, కవిత సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: తెలుగు వ్య‌క్తికి జాతీయ స్థాయిలో ఛాన్స్.. ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి పరిచయ కార్యక్రమంలో సీఎం రేవంత్

Etela Rajender: కాళేశ్వరం కేసుపై సీబీఐ విచారణ.. నోరు విప్పిన ఈటల

KCR With KTR: కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, ఇప్పుడేం చేద్దాం?

Big Stories

×