E-Paper
Advertisement

RV Karnan: శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ కర్ణన్

RV Karnan: శానిటేషన్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ కర్ణన్
Advertisement

RV Karnan:  గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి ఇంటి నుంచి డైలీ చెత్త సేకరణ చేయాల్సిందేనని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ సూచించారు. జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో కలిసి ఇందిరా పార్క్ గాంధీ నగర్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వరకు శానిటేషన్ పనులను ఆయన బుధవారం తనిఖీ చేశారు. సురభి పార్క్, పీ అండ్ టీ కాలనీ, గాంధీ నగర్ డివిజన్, కవాడిగూడ ప్రాంతాల్లో కమిషనర్ చెత్త సేకరణ, స్వీపింగ్ పనులను పరిశీలించారు. ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో స్వచ్ఛ ఆటో ల హాజరు, రెగ్యులర్ పారిశుద్ధ్య కార్యకలాపాలను ఆయన తనిఖీ చేశారు. స్వచ్ఛ ఆటో పారిశుద్ధ్య కార్మికులు ప్రతి రోజూ తప్పనిసరిగా డోర్-టు-డోర్ చెత్త సేకరణ చేసేలా పర్యవేక్షించాల్సిన బాధ్యత సదరు సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లదేనని ఆయన గుర్తు చేశారు. పబ్లిక్ ప్లేస్ లు, రోడ్లు, జంక్షన్లు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక ఫోకస్ పెట్టాలని కమిషనర్ ఆదేశించారు. నూటికి నూరు శాతం ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించాలని సూచించారు.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

ఎంఎంసీ కమిషనర్ క్షేత్ర స్థాయి పర్యటన

Advertisement

మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ క్రిష్ణారెడ్డి కాప్రా సర్కిల్ లో ఓల్డ్ కాప్రా, డాబా గార్డెన్, ఎల్లారెడ్డిగూడ ప్రాంతాలలో బుధవారం ఉదయం క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. సాకేత్ రోడ్ లోని సెకండరీ కలెక్షన్ పాయింట్ ను సందర్శించారు. వీలయినన్ని సెకండరీ కలెక్షన్ పాయింట్ లు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఓల్డ్ కాప్రాలో స్వచ్ఛ ఆటో డ్రైవర్ తో మాట్లాడుతూ కాలనీ లోని ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించాలని సూచించారు. అదే ప్రాంతంలోని కాలనీ వాసులతో మాట్లాడుతూ ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారు కూడా చెత్తను స్వచ్ఛ ఆటో కార్మికులకే ఇవ్వాలని కమిషనర్ సూచించారు.

Also Read:RV karnan: GHMC డీలిమిటేష‌న్‌పై కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ స్పష్టీకరణ.. అభ్యంతరాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం..! 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×