BigTV English

Hydra Action: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Hydra Action: కూకట్ పల్లి, అమీన్ పూర్ లో హైడ్రా కొరడా.. అక్రమ అపార్టుమెంట్ల కూల్చివేతలు

Hydra Action: గ్రేటర్‌ వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను కాపాడే దిశగా హైడ్రా దూసుకుపోతోంది. నేడు నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లోని అక్రమనిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతల కార్యక్రమం సాగుతోంది. మరోవైపు.. అమీన్‌పూర్‌ ప్రాంతాల్లోనూ హైడ్రా కూల్చివేతలూ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమ నిర్మాణాలను ఎంతటివైనా కూల్చివేయడంలో హైడ్రా అధికారులు వెనక్కి తగ్గడం లేదు. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఏదో ఒక ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై హైడ్రా దృష్టి సారిస్తోంది. నల్లచెరువును అనుకుని ఉన్న నిర్మాణాలను కూల్చివేసేందుకు తెల్లవారుజామునే హైడ్రా సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా భారీగా మోహరించారు.


కూకట్ పల్లిలోని నల్లచెరువు వద్ద హైడ్రా కూల్చివేతల్ని చేపట్టింది. నివాసిత భవనాలను వదిలి.. ప్రస్తుతం నిర్మాణ దశల్లో ఉన్న భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. గతంలో మాధాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేతల సమయంలో.. నిర్మాణంలో ఉన్న భవనాలనే కూల్చివేయాలని ఆదేశాలు జారీ అయిన విషయం తెలిసిందే. నల్ల చెరువు వద్ద 27 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురవ్వగా.. 25 అపార్టుమెంట్లు, ఒక భవనాన్ని బఫర్ జోన్ లో నిర్మించారు. ప్రస్తుతం 16 నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

Also Read: బిగ్ టీవీ ఎఫెక్ట్.. విజయ డెయిరీ నష్టాలపై విచారణకు సీఎం ఆదేశం


మరోవైపు సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోనూ హైడ్రా కొరడా విధిలించింది. కృష్ణారెడ్డిపేట 12వ సర్వే నంబర్లో చేపట్టి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది హైడ్రా. సుమారుగా 16 అక్రమ నిర్మాణాలున్నాయని గుర్తించిన అధికారులు.. కూల్చివేతలు ప్రారంభించారు. అవన్నీ ఒక బీఆర్ఎస్ నేతకు చెందినవిగా గుర్తించారు. కాగా.. హైడ్రా కూల్చివేతలతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఎన్నో ఆశలతో ఇంటికి డబ్బులిచ్చామని, ఇప్పుడు అక్రమ నిర్మాణాల పేరిట కూల్చివేతలు చేపడితే.. తామేం కావాలని ప్రశ్నిస్తున్నారు.

 

Related News

Bhuvanagiri collector: పల్లెకు వెళ్లిన భువనగిరి కలెక్టర్.. సమస్యలన్నీ ఫటాఫట్ పరిష్కారం!

BRS BC Meeting: బీఆర్ఎస్ కరీంనగర్ బీసీ సభ వాయిదా..? కాంగ్రెస్ ధర్నా సక్సెసే కారణమా?

CM Revanth Reddy: కేంద్రంలో బీజేపీని గద్దె దింపుతాం.. సిఎం రేవంత్ రెడ్డి

Konda Surekha: బీజేపీపై బిగ్ బాంబ్ విసిరిన కొండా సురేఖ.. రాష్ట్రపతినే అవమానించారంటూ కామెంట్స్!

Mahesh Goud: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంది.. బీజేపీకి ఆ సత్తా ఉందా? మహేష్ గౌడ్ ఫైర్!

Raj Gopal Reddy: కేసీఆర్ మౌనంగా ఉంటే ఎలా? లేదంటే రాజీనామా చేయ్..

Big Stories

×