E-Paper
Advertisement

HYDRA Warns: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు!

HYDRA Warns: హైదరాబాద్‌లో స్థలం లేదా ఫ్లాట్ కొంటున్నారా? హైడ్రా కీలక సూచనలు!
Advertisement

HYDRA Warns: ఓపెన్ ప్లాట్లు, ఇంటి స్థ‌లాలు, అపార్ట్ మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసే ముందే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని నగరవాసులకు హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఏమైనా ఉన్నాయా? అనుమ‌తి పొందిన లే ఔటా? కాదా? ప‌రిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది. గేటెడ్ క‌మ్యూనిటీ అంటూ ప్లాట్లు, విల్లాలు అమ్ముతున్న‌ప్పుడు ఆ అనుమ‌తుల‌ను ప‌రిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని హితవు పలికింది. ప్ర‌జావాణికి వ‌చ్చిన ఫిర్యాదుల నేప‌థ్యంలో హైడ్రా ఫిర్యాదుదారులకు ఈ జాగ్రత్తలను సూచించింది.

సోమ‌వారం హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 48 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప‌రిశీలించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్‌, శాటిలైట్ ఇమేజీల ఆధారంగా ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు. లే ఔట్‌ను ప‌రిశీలించి న్యాయం చేస్తామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హామీ ఇవ్వ‌డంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

Also Read: BSNL Recharge Plan: రోజుకు రూ.6తో.. 164 రోజుల పాటు.. 300GB డేటా, అపరిమిత కాల్స్!

హైడ్రాకు అందిన ఫిర్యాదుల విషయానికి వస్తే.. బాచుప‌ల్లి చెరువులో మురుగునీరు వ‌చ్చి చేరుతోందని దీని వల్ల దోమలు విపరీతంగా వచ్చి చేరుతున్నాయని హ‌రిహ‌ర హాల్‌ మార్కు క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ ప్రతినిధులు ప్ర‌జావాణిలో విజ్ఞ‌ప్తి చేశారు. అటు సంగారెడ్డి అమీన్‌పూర్ చెరువులో త‌మ లే ఔట్ మునిగిపోయింద‌ని, చెరువులో నుంచి నీరు బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో వ‌రుస‌గా చాలా లే ఔట్‌లు నీటిలో మునిగిపోయాయని సెక్ర‌టేరియ‌ట్ ఎంప్లాయీస్ హౌజింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు వాపోయారు. చెరువు ఎప్‌టీఎల్ ను నిర్ధారించి తమ లే ఔట్‌లు మున‌గ‌కుండా చూడాల‌ని, త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి ఉంటే వెంట‌నే త‌గిన విధంగా న‌ష్ట ప‌రిహారం ఇప్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఇలా పలు రకాల ఫిర్యాదులు హైడ్రాకు అందాయి.

Advertisement

Also Read: LPG Saving Kitchen Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? చాలా మంది కిచెన్‌లో చేసే 10 పొరపాట్లు ఇవే!

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×