E-Paper
Advertisement

Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?

Budget : జనం మెచ్చితే ఎవరు ఆపుతారు?
Advertisement

రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తెలంగాణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.మొత్తం 3.24 లక్షల కోట్లతో ప్రభుత్వం ఆర్థిక పద్దును ప్రవేశపెట్టగా..ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెబుతోంది. రాష్ట్రంలో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు,మూలధన వ్యయం రూ.47,267కోట్లు, తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లుగా ప్రభుత్వం ఆర్థిక పద్దులో చూపించింది. ఇదిలాఉండగా,గత బడ్జెట్‌కు ప్రస్తుత బడ్జెట్‌కు చాలా తేడా ఉన్నది. గతంలో అంచనా వేసినట్టుగా ఆదాయం రాకపోవడంతో ఈసారి వాస్తవానికి దగ్గరగా ఆర్థికపద్దును ప్రిపేర్ చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలిసింది.ఈ మేరకు ఆర్థిక శాఖ బడ్జెట్ పద్దును ప్రిపేర్ చేసింది.

సంక్షేమం, కీలక రంగాలకు పెద్దపీట..

తాజా బడ్జెట్‌లో సంక్షేమం, సామాజిక వర్గాలకు సర్కారు పెద్దపీట వేసింది. వ్యవసాయశాఖకు రూ.23,179 కోట్లు, పౌరసరఫరాల శాఖ రూ.7,366 కోట్లు, పశుసంవర్ధకశాఖ రూ.1,529 కోట్లు, విద్యుత్ శాఖ రూ.21,285 కోట్లు, కార్మికశాఖకు రూ.998 కోట్లు, మాతా, శిశు సంక్షేమ శాఖ రూ.3,143 కోట్లు, పర్యాటకరంగం రూ.1,224 కోట్లు, రైతు భరోసా రూ.18వేల కోట్లు, ఆరోగ్య శాఖకు రూన.13,679 కోట్లను సర్కారు కేటాయించింది. ఇక సామాజిక వర్గాల సంక్షేమం విషయంలో బీసీలకు రూ. 12,511 కోట్లు, మైనార్టీలకు రూ. 3,769 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.7,937 కోట్లు కేటాయించారు.

అభివృద్ది, ప్రాజెక్టులకు సైతం..

Advertisement

గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు పెండింగులో ఉన్న విషయం తెలిసిందే. వాటిని ఈ ఏడాది చివరివరకు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ క్రమంలోనే సాగునీటి ప్రాజెక్టులకు రూ.22,615 కోట్లు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పెండింగ్ అభివృద్ది పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు గాను రూ.33,688 కోట్లు కేటాయించింది.అదేవిధంగా ఆర్ అండ్ బీ, రవాణా మెరుగుకోసం రూ.12,789 కోట్లు, మున్సిపల్ పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.17,907 కోట్లు కేటాయించింది. ముఖ్యంగా విద్యా రంగం అభివృద్దికి, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, స్కాలర్ షిప్స్ చెల్లింపులకు గాను రూ.26,674 కోట్లు కేటాయించింది. ప్రస్తుత బడ్జెట్ ప్రజారంజకంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. విద్యార్థులకు తీపి కబురు, ఆపై ఇంటర్, ఐటీఐల్లో

Advertisement

గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ వాస్తవానికి దూరంగా ఉండేదని, అంకెలతో గారఢీ చేసేవారని..కానీ, సీఎం రేవంత్ దూర దృష్టితో వాస్తవికతకు అద్దం పట్టేలా బడ్జెట్ తయారుచేశారని.. ఎటువంటి అంకెల గారఢీ కనిపించడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇది ప్రజాబడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎందుకంటే ఇందులో సంక్షేమం, విద్యా, వైద్యం, సాగుతాగు నీటి రంగాలకు పెద్దపీట వేసినట్టు సర్కారు చెబుతోంది. కాగా, అంకెలతో గారఢీ చేశారని..బడ్జెట్‌లో కొత్త అంశాలు ఏమీ లేవని,పాత పద్దుకే కొత్త రంగులు అద్ది తీసుకొచ్చారని.. ఇది ప్రజాబడ్జెట్ కాదని.. ప్రజా వంచక బడ్జెట్ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బడ్జెట్‌లో మహిళలకు రూ.2500, పెన్షన్ పెంపు, తులం బంగారం, ఆరు గ్యారెంటీలపై ప్రస్తావన ఎక్కడ ఉందని బీఆర్ఎస్ ప్రశ్నించింది. కాగా, ఈ బడ్జెట్ ప్రజలకు నచ్చితే, వారికి అభ్యంతరం లేకపోతే ప్రభుత్వాన్ని ఎవరు ఆపగలరని  నెట్టింట చర్చ జరుగుతున్నది.

 

 

 

 

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×