E-Paper
Advertisement

వీకెండ్ మస్త్ మజా.. డ్రగ్స్ నిషా.. చేవెల్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల హల్చల్..!

వీకెండ్ మస్త్ మజా.. డ్రగ్స్ నిషా.. చేవెల్లలో అక్రమ ఫామ్ హౌస్‌ల హల్చల్..!
Advertisement

Illegal Farmhouses: అక్రమంగా వెలుస్తున్న ఫామ్ హౌస్‌లు
ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో నిర్మాణాల జోరు
ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నా పట్టించుకోని అధికారులు
వీకెండ్ అద్దె వ్యాపారంగా మారిన ఫామ్ హౌస్‌లు

స్వేచ్ఛ,చేవెళ్ల: నియంత్రణ లేకుండా సాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణాలపై కట్టడి అవసరం అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరానికి సమీపంలో ఉన్న చేవెళ్ల మండలం రోజురోజుకు ఫామ్ హౌస్‌ల కేంద్రంగా మారుతోంది. ముఖ్యంగా వీకెండ్‌లలో ఈ ప్రాంతంలోని ఫామ్ హౌస్‌లు సందర్శకులతో కిక్కిరిసి పోతున్నాయి. ఈ క్రమంలో కొన్ని చోట్ల మద్యం, డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉండగా, గతంలో పోలీసులు పలుమార్లు దాడులు చేసి కేసులు నమోదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి.

అనుమతుల కోసం తంటాలు

Advertisement

మండలవ్యాప్తంగా విస్తరించిన ఫామ్‌ల్యాండ్ వెంచర్లలో అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణాలు కొనసాగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, మౌన సమ్మతి కారణంగానే ఈ అక్రమాలు పెరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. గ్రామాల్లో సాధారణ ప్రజలు చిన్న ఇల్లు నిర్మించాలంటే అనుమతుల కోసం తంటాలు పడుతుండగా, భారీ స్థాయిలో నిర్మాణాలు జరుగుతున్న ఫామ్ హౌస్‌లపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి గండి వ్యవసాయ భూమిలో ఇళ్ల నిర్మాణానికి ముందు భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చితే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది.

Also Read: తెలంగాణ ఎక్సైజ్ శాఖ సరికొత్త రికార్డు.. రూ.44,000 కోట్ల ఆదాయంతో చరిత్ర సృష్టి!

నియంత్రణ లేని వ్యాపారం..

Advertisement

అయితే ఈ నిబంధనలను పక్కన పెట్టి అనేక మంది యజమానులు నేరుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఫామ్ హౌస్ బిజినెస్ వీకెండ్ రాగానే నగరానికి చెందిన వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్‌లకు చేరుకుంటున్నారు. వ్యక్తుల సంఖ్య, సౌకర్యాల ఆధారంగా అద్దె నిర్ణయించి యజమానులు వ్యాపారం సాగిస్తున్నారు. ఈ విధంగా ఫామ్ హౌస్‌లు వినోదానికి కేంద్రాలుగా మారి, నియంత్రణ లేని వ్యాపారంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకొని, ప్రభుత్వ ఆదాయాన్ని రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ప్రజలు కోరుతున్నారు.

Also Read: తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. విశాఖకు భారీ LPG నౌక.. గ్యాస్ కష్టాల నుంచి ఊరట

Tags

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×