E-Paper
Advertisement

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌

Orange Alert : సుర్రుమంటున్న సూరీడు.. 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్‌ అలర్ట్‌
Advertisement

SummerSummer: మార్చి నెల మొదటి నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని తెలుగు రాష్ట్రాలపై చూపిస్తున్నాడు. తాజాగా భానుడు మరింత ఉగ్రరూపం దాల్చాడు. దీంతో ప్రజలు మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి బయపడిపోతున్నారు. అయితే భానుడి ప్రతాపం మరికొన్ని రోజులు కొనసాగనుందని ఐఎండీ తెలిపింది. రాగల ఐదు రోజులు రాష్ట్రంలో ఎండలు మరింత మండిపోనున్నాయని.. కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు.

రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉందని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల అధికారులకు వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement

ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటుగా నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సైతం వడగాల్పులు వీచే అవకాశం ఉందంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. సోమవారం నుంచి రాష్ట్రంలోని 15 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు గతంలో కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వెల్లడించింది. పగటి సమయంలో వృద్ధులు, చిన్నారులు బయటకు రావొద్దని ఐఎండీ హెచ్చరించింది.

Tags

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×