BigTV English

AP Election Observers: పార్టీలు, అభ్యర్థులపై ప్రత్యేక నిఘా, ఏం చేస్తారు?

AP Election Observers: పార్టీలు, అభ్యర్థులపై ప్రత్యేక నిఘా, ఏం చేస్తారు?

Election Observers Rammohan mishra reached vijayawada


AP election latest news today(Andhra news updates): ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓ వైపు నేతల ప్రచారాలు.. ఇంకో వైపు కేంద్ర బలగాలు రావడం.. మరోవైపు ఎన్నికల అబ్జర్వర్లు. ఇప్పటికే కేంద్ర బలగాలు సమస్యాత్మక ప్రాంతాలకు చేరుకున్నాయి. వివిధ ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నాయి. ఇక ఎన్నికల అబ్జర్వర్ల వంతైంది. ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ రామ్‌మోహన్ మిశ్రా రాత్రి విజయవాడకు చేరుకున్నారు. ఆయనకు ఏపీ ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా స్వాగతం పలికారు.

ఏపీలో మే 13న ఒకే విడతలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే కోడ్ అమల్లోకి వచ్చింది. దీన్ని పలుపార్టీలు కోడ్ ఉల్లంఘించనట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెళ్లాయి. పరస్పర దాడులు, హింసాత్మక ఘటనలు జరగడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది.


ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి ప్రత్యేకంగా ముగ్గురు పరిశీలకులను నియమించింది. వారిలో పోలీసులు, సాధారణ, ఎన్నికల వ్యయ పరిశీలకులు ఉన్నారు. ఇప్పటికే రామ్మోహన్ మిశ్రా చేరుకోగా, ఇరు ఇద్దరు అధికారులు మంగళవారం విజయవాడకు రానున్నారు. ఈ ముగ్గురు అధికారులు ఏపీలో విస్తృతంగా పర్యటించనున్నారు.

ALSO READ:అయోమయంలో మంత్రి.. షాకిస్తున్న ఓటర్లు.. !

1987 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామ్మోహన్ మిశ్రా. ఎన్నికలు, వాటి పరిశీలన వంటి బాధ్యతలు ఆయన చూడనున్నారు. పార్టీల అభ్యర్థులు ఏమాత్రం నిబంధనలను అతిక్రమించినట్లు తెలిసినా వెంటనే చర్యలు తీసుకునే అవకాశముంది. మొత్తానికి ఎన్నికల కౌంటింగ్ అయ్యేవరకు పార్టీలతోపాటు అభ్యర్థుల వ్యవహారాలపైనా ప్రత్యేక అధికారులు నిఘా వేసే ఛాన్స్ ఉంది.

Related News

Vijayawada News: ఫుడ్ ఆర్డర్ మారింది.. ఇలా ఏంటని ప్రశ్నిస్తే.. పీక కోసేస్తారా భయ్యా..?

Sajjala Ramakrishna Reddy: సజ్జలకు జగన్ వార్నింగ్? వారికి మాత్రం పండగే

TTD VIP Darshan: భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

AP Mega DSC: నవంబర్‌లో టెట్ ఎక్జామ్ .. ఏపీ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న‌

YS Sharmila: ఓటు చోరీ జరిగింది.. త్వరలోనే ఆధారాలతో బయటపెడతాం: షర్మిల

Onion Price: కిలో ఉల్లి రూ.5 మాత్రమే.. ఎక్కడో కాదు మన రాష్ట్రాల్లోనే!

Aghori Hulchul In Guntur: చంద్రగ్రహణం రోజు అఘోరాల పూజలు.. విరుగుడుగా శాంతి పూజలు

AP Politics: ఏపీని షేక్ చేస్తున్న ఐఏఎస్ గిరిషా.. అసలు కథ ఇదే..

Big Stories

×