
Malla Reddy : మాజీ మంత్రి మల్లారెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన గన్‌మెన్ ఈ వివాదానికి కారణమయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో కొట్టగట్టు ఆంజనేయస్వామి ఆయలంలోకి ప్రవేశించారు. గన్‌తో ఆలయంలోకి వెళ్లి ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.
దేవాలయంలోకి ఆయుధాలతో రావడంతో చర్చనీయాంశంగా మారింది. ఆలయంలోకి వెళ్లే సమయంలో కనీస నిబంధనలు పాటించకపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.