BigTV English

KTR : బీజేపీని ఆపగలిగే శక్తి ఆ పార్టీలకే ఉంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

KTR : బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అద్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR : బీజేపీని ఆపగలిగే శక్తి ఆ పార్టీలకే ఉంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

KTR : బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ విసిరారు. ఆ పార్టీకున్న 40 స్థానాలను నిలబెట్టుకునే అవకాశం లేదంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్టీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి వల్లనే ఇండియా కూటమి చెల్లా చెదురవుతోందని కేటీఆర్ అన్నారు. దీనిపై ఆ నేతలు ఆత్మపరీశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలో బీజేపీని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరన్నారు.

గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోందని ఆరోపించారు. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.


Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×