BigTV English

Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

Telangana BJP: మొత్తం మార్చండి.. స్పీడ్ పెంచాలి.. పార్టీ అధిష్టానం గురి పెట్టింది.. బీజేపీ ఇంచార్జ్ పాటిల్

Telangana BJP: మొత్తం మార్చేయండి.. ఇదేనా భాద్యత.. భాద్యతను విస్మరిస్తే మనం ఎలా బలోపేతమవుతాం.. అంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగకపోవడంతో బీజేపీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.


తెలంగాణలోని అన్ని జిల్లాలను కలుపుకొని మొత్తం 50 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేసుకోవాలని బీజేపీ లక్ష్యాన్ని ఎంచుకుంది. కానీ అది ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. అలాగే ఇప్పటివరకు 20 లక్షల మందికి పైగా సభ్యత్వ నమోదు చేసుకున్నా.. కొంతమంది వివరాలు సక్రమంగా లేవట. జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యత్వాన్ని నమోదు చేసుకోవచ్చని బీజేపీ నిర్ణయించగా.. ఈ నెల 15 నాటికి నమోదు పూర్తి కావాల్సి ఉంది. అసలు సభ్యత్వ నమోదు ఎందుకు ఆలస్యమవుతోంది ? దీని వెనుక కారణాలు ఏమున్నాయని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ లు సమీక్షించారు.

సమీక్ష అనంతరం సభ్యత్వ స్టేట్ కమిటీ, జిల్లా కమిటీ సభ్యులను మార్చాలని నాయకులకు, పాటిల్ ఆదేశాలు ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ బలోపేతం అయ్యేందుకు పార్టీ అధిష్టానం దృష్టి సారించినా.. ఆ మేరకు క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.


Also Read: Mlc Elections: ప్రజాపాలన సాగిస్తున్నాం.. ప్రజల్లోకి వెళ్లండి.. విజయం మనదే కావాలి.. సీఎం రేవంత్

ఈ సంధర్భంగానే పాటిల్ మాట్లాడుతూ.. బీజేపీ సభ్యత్వం పెంపుదల దిశగా జాతీయ నాయకత్వం విస్తృత కృషి చేస్తోందన్నారు. ప్రతి కార్యకర్త సభ్యత్వ నమోదు ప్రక్రియలో చురుకైన పాత్ర పోషించాలని, పార్టీని బలోపేతం చేయడానికి ఇది కీలకమైన అవకాశమని ఆయన పేర్కొన్నారు. నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త.. సైనికుడిలా చేయాలని అప్పుడే పార్టీ లక్ష్యాన్ని చేరుకుంటుందన్నారు. కాగా అసలు కొత్త బీజేపీ అద్యక్షుడి అంశం కూడా ఈ దశలో తెర మీదికి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు.

మంత్రిగా కూడా భాద్యతలు నిర్వహిస్తున్న కిషన్ రెడ్డి స్థానంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నా.. ఆ విషయం అలాగే పెండింగ్ లో ఉంది. కాగా కొంత మంది పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాగిస్తున్నా.. ప్రతి కార్యకర్త ఈ విషయంలో వెనుకడుగు వేయవద్దన్నది పార్టీ అధిష్టానం పెద్దల అభిప్రాయం. మరి బీజేపీ అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా లేదా అన్నది వేచి చూడాలి.

Related News

Ganesh Festivals: గణేశోత్సవంలో షాకింగ్ ఘటన.. లడ్డూ కేవలం రూ. 99! ఎక్కడో తెలుసా?

CM Revanth Reddy: హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి!

Ganesh laddu: గణేశ్ లడ్డూ వేలంలో ముస్లిం మహిళ.. ఇదే ఇండియా అంటూ కామెంట్స్!

BRS Politics: స్థానిక సంస్థల ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్.. కేటీఆర్ జిల్లాల పర్యటన, డేట్ కూడా ఫిక్స్?

Hyderabad Accident: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పోలీసు వాహనాన్ని ఢీకొన్న మరో కారు

Warangal Rains: వరంగల్‌లో కుమ్మేస్తున్న భారీ వర్షం.. నీటిలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సులు

Big Stories

×