Animal Food Robber| దొంగలు, అవినీతిపరులు ప్రపంచంలో ప్రతి దేశంలో ఉన్నారు. అయితే ఏ స్థాయిలో అవినీతి జరిగింది. ఎంత పెద్ద దొంగతనం జరిగిందనేది విచారణ చేయాల్సిన విషయం. కొన్ని దేశాల్లో అవినీతిపరులకు కఠిన శిక్ష ఉంటుంది. తాజాగా ఒక వ్యక్తి తనకు లక్షల సంపాదన ఉన్నా జంతువుల ఆహారం దోచుకొని అమ్ముకునే వాడు. చివరకు అతని అవినీతి వెలుగులోకి రావడంతో ఉద్యోగం కోల్పోయాడు. ఈ ఘటన జపాన్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. జపాన్ దేశంలోని ఒసాకా నగరంలో టెన్నోజి జూ పార్క్ ఉంది. వంద సంవత్సరాలకు పైబడిన జూలో 170 జాతులకు చెందిన 1000 జంతువులున్నాయి. అయితే గత కొంతకాలంగా జంతువులకు ఇచ్చే ఆహారం జూ పార్క్ నుంచి మాయమవుతోంది. ముఖ్యంగా కోతులకు జూ పార్క్ నిర్వహకులు ఇచ్చే పండ్లు, కూరగాయలు లాంటి ఆహారం త్వర త్వరగా అయిపోతోంది. ఇదెలా జరుగుతోందో ఎవరికీ అర్థం కాలేదు.
Also Read: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!
జపాన్ వార్తా సంస్థ ‘సంకెయి శింబున్’ ప్రకారం.. జూ పార్క్ లో దొంగతనం జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. కానీ ఎవరు దొంగతనం చేస్తున్నారో వారికి సమాచారం లేదు. దీంతో టెన్నోజీ జూ పార్క్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ ప్రారంభించి జూ పార్క్ లో కొన్ని ప్రదేశాల్లో సీసీటీవి కెమెరాలు ఏర్పాటు చేశారు.
ఆ తరువాత ఒకరోజు రాత్రి ఒక దొంగ చాటుగా జూ పార్క్ లోని చింపాజీలు, కోతులు ఉండే ప్రదేశంలో తిరుగుతున్నట్లు ఆ వీడియోల్లో కనిపించింది. ఆ వ్యక్తి రాత్రి వేళ కొద్ది కొద్దిగా ఆ కోతుల ఆహారం ఒక బ్యాగులో వేసుకొని వెళ్లిపోయాడు. అయితే ఒక కెమెరా యాంగిల్ లో ఆ దొంగ ముఖం కనిపించింది.
అతను మరెవరో కాదు ఆ జూ పార్క్ నిర్వహకుడు జూ కీపర్ యసూఫు యుకేషి. అతని వయసు 47 ఏళ్లు. యసూఫు ఆ జూపార్క్ లో అనిమల్ కేర్, బ్రీడింగ్ షోకేస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తున్నారు. పోలీసులు సిసిటీవి వీడియో ఆధారాలతో యసూఫుని అరెస్టు చేశారు. అయితే ఇప్పటివరకు యసూఫు ఎందుకు అలా జంతువుల ఆహారం దొంగతనం చేసేవాడో కారణం తెలియలేదు.
ఈ వార్త గురించి అక్టోబర్ 2న జపాన్ వార్తా పత్రికల్లో ప్రచురితమైంది. దీంతో సోషల్ మీడియాలో టెన్నోజీ జూ పార్క్ దొంగ గురించి వేడి వేడిగా యూజర్లు కామెంట్ చేస్తున్నారు. ఒక యూజర్ అయితే.. ”అతను జంతువుల ఆహారాన్ని తనే స్వయంగా తినలేడు కదా తప్పకుండా బయట అమ్ముకుంటున్నాడేమో” అని రాశాడు.
మరో యూజర్ అయితే ”పాపం ఆ చింపాజీలు వారికి కడుపు నిండా ఆహారం లేకుండా చేశాడు. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో జూ కీపర్ ఆ దొంగతనాలు చేశాడేమో?” అని కామెంట్ చేసింది.
ఇంకొక యూజర్ అయితే.. ”జూ నిర్వహకులు అతనికి సరిపడా జీతం ఇవ్వడం లేదేమో? అందుకే ఖర్చులు తగ్గించుకోవడానికి పండ్లు, కూరగాయలు దొంగతనం చేశాడు.” అని కామెంట్ పెట్టాడు.
Also Read: అయిదుగురు యువతులను ఒకేసారి పెళ్లి చేసుకున్న వరుడు.. వైరల్ వీడియో
అయితే ఒక జపాన్ లేబర్ మంత్రిత్వశాఖ తెలిపిన సమాచారం ప్రకారం.. ఒక జూకీపర్ వార్షిక ఆదాయం 24,000 అమెరికన్ డాలర్లు (రూ.20 లక్షలకు పైనే). మరి అంత జీతం వస్తున్నా యసూఫీ ఎందుకు ఇలా పండ్లు, కూరగాయలు దొంగతనం చేయాల్సి వచ్చిందో? ఇంకా పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం యసూఫీని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.