E-Paper
Advertisement

OTT Movie : ప్రేమ పేరుతో వల విసిరి అమ్మాయిల గొంతు కోసే సైకో కిల్లర్… పీడకల లాంటి సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ప్రేమ పేరుతో వల విసిరి అమ్మాయిల గొంతు కోసే సైకో కిల్లర్… పీడకల లాంటి సస్పెన్స్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఈ ప్రపంచంలో ప్రేమ పేరుతో ఎంతమంది మైకంలో మునిగితేలుతున్నారో అంతకంటే ఎక్కువ మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రేమ పేరును ఉపయోగించుకుని కొంతమంది చేసే నేరాలు ఘోరాలు అన్ని ఇన్ని కావు. ఒక్కసారి న్యూస్ ఛానల్ ఆన్ చేస్తే ఇలాంటి వార్త లు లెక్కలేనని కనిపిస్తాయి. అయితే ఈ ప్రేమ పేరుతో మోసం కాన్సెప్ట్ కి సైకో కిల్లర్ తోడైతే ఎలా ఉంటుందో తెలిపే సినిమానే ఈరోజు మనం మూవీ సజెషన్. మరి ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? కథ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ప్రైమ్ వీడియోలో అందుబాటులో…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా అదిరిపోయే ట్విస్టులతో ఆకట్టుకుంటుంది. పైగా సినిమాను చూసాక ప్రేమ అనే మాట వినిపిస్తేనే వణికిపోతారు. అలాగే సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు గ్రిప్పింగ్ నరేషన్ కూడా ఆకట్టుకుంటుంది. రెగ్యులర్ గా థ్రిల్లర్ హారర్ సినిమాలను చూసేవారు కూడా ఈ సినిమాను చూస్తే ఫిదా అవుతారు. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. సినిమా ఒక అందమైన లవ్ స్టోరీ గా స్టార్ట్ అయి ఆ తర్వాత వణికించే మలుపులు తిరుగుతుంది.

కథలోకి వెళ్తే…

Advertisement

హీరోయిన్ రోడ్డు దాటుతూ కనిపిస్తుంది. ఆ హడావిడిలో ఆమె చేతిలో ఉన్న వస్తువులు కింద పడిపోతాయి. అది చూసిన ఓ వ్యక్తి వచ్చి హీరోయిన్ కి హెల్ప్ చేస్తాడు. అక్కడితో ఆగకుండా ఆమెతో మాటలు కలుపుతాడు. అయితే హీరోయిన్ ఏమాత్రం ఆలోచించకుండా అనామకుడైన ఆ వ్యక్తికి తనొక లేడీ జర్నలిస్ట్ అని, హాలిడే కోసం బెర్లిన్ కి వచ్చానని చెప్పేస్తుంది. ఈ అమ్మడు టూర్ కు వచ్చి బెర్లిన్ ను ఎక్స్ప్లోర్ చేస్తూ,  అక్కడ తనకు నచ్చిన పక్షులను, ఈ కొత్త ప్రదేశాన్ని ఫోటోలు తీస్తూ మెమరీలుగా దాచుకుంటుంది. అయితే ఈ క్రమంలోనే ఈ సైకో పరిచయం అవుతాడు. ఇక నెమ్మదిగా ఇద్దరు మధ్య రొమాన్స్ మొదలవుతుంది. అంతేకాదు ఓరోజు హీరోయిన్ అతని ప్లాట్ కు వెళ్లి నైట్ అక్కడే గడుపుతుంది కూడా. కానీ ఈ జర్నలిస్ట్ నిద్ర లేచి చూసేసరికి అతను కనిపించడు. అయితే కొత్త ప్రదేశం కావడంతో ఆ ఇల్లంతా కలియ తిరుగుతూ రూమ్ లో కనిపించిన ఆల్బమ్ ను తిరగేస్తుంది హీరోయిన్. అందులో అతనితో పాటు మరికొందరు అమ్మాయిల ఫోటోలు కూడా ఉండడంతో అలర్ట్ అవుతుంది. వెంటనే అతని మీద అనుమానం రావడంతో ఆ ఇంట్లో నుంచి బయటపడడానికి ట్రై చేస్తుంది. కానీ తీరా చూస్తే ఎక్కడకక్కడ ఇల్లంతా లాక్ చేసి ఉండడంతో తాను ట్రాప్ లో పడ్డానని తెలుసుకుంటుంది హీరోయిన్. ఎంత ట్రై చేసినా ఆ ఇంట్లో నుంచి ఎక్కడికీ కదల్లేకపోతుంది. మరి అక్కడ నుంచి హీరోయిన్ ఎలా బయటపడింది? ఆ సైకో కిల్లర్ ఎందుకు అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నాడు? అనే విషయం తెలియాలంటే బెర్లిన్ సిండ్రోమ్ అనే సినిమాను చూడాల్సిందే.

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×