EPAPER

Farmers: బ్రేకింగ్ న్యూస్.. రైతులకు భారీ శుభవార్త

Farmers: బ్రేకింగ్ న్యూస్..  రైతులకు భారీ శుభవార్త

Good News for Farmers: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ శుభవార్తను చెప్పాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పామాయిల్ రైతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నది. దీనిపైన అవగాహన పెంచుతూనే ఉంది. పామాయిల్ పంటను ఎక్కువగా సాగు చేసి రైతులు లబ్ధి పొందేలా కృషి చేస్తుంది. అయితే, ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అందుకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు మేలు జరుగనున్నది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..


Also Read: పాడి కౌశిక్ రెడ్డి ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌కు మరో షాక్ తప్పదా?

రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు తాజాగా భారీ ఊరట లభించింది. వారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పామాయిల్ దిగుమతిపై 5.5 నుంచి 27.5 వరకు పన్ను శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ విషయమై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం ఎత్తివేయడంతో ఆయిల్ పామ్ గెలల ధర తగ్గిందని, దీంతో పామాయిల్ రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారంటూ లేఖ రాశారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ పంట సాగు చేయాలన్న రైతులు ఇటువైపు ఏ మాత్రం మొగ్గుచూపడంలేదని, దీంతో సాగుచేస్తున్న రైతులపై ప్రతికూల ప్రభావం చూపిందంటూ అందులో ప్రస్తావించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు జరిగే విధంగా నిర్ణయం తీసుకోవాలంటూ మంత్రి తుమ్మల లేఖ ద్వారా విన్నవించుకున్నారు. అదేవిధంగా వరదల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కు కూడా ఈ విషయాన్ని గుర్తుచేశారు. మంత్రి చొరవతో తాజాగా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ నెల 13న అందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ముడి పామాయిల్ దిగుమతిపై సుంకం 5.5 నుంచి 27.5 శాతం పెంచింది. ఉత్తర్వులను సైతం జారీ చేసింది.


Also Read:  నాలుక చూసి రోగం ఏంటో చెప్పేస్తుంది, డాక్టర్ కాదండోయ్ AI టెక్నాలజీ.. ఇదిగో ఇలా గుర్తిస్తుందట!

ఈ నేపథ్యంలో మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర నిర్ణయంతో ఆయిల్ పామ్ గెలల ధర రూ. 1500 నుంచి రూ. 1700 వరకు పెరిగితే ఒక టన్నుకు రూ. 16,500 పైగా వచ్చే అవకాశం ఉందంటూ ఆయన పేర్కొన్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం సాగవుతున్న పామాయిల్ పంట వివరాలను మంత్రి వెల్లడించారు. 44,400 ఎకరాల్లో రైతులు పామాయిల్ పంటను సాగుచేస్తున్నారని చెప్పారు. ఆ పంటలను నుంచి రైతులకు 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తుందని తెలిపారు. ఇప్పటివరకు 9,366 మంది పామాయిల్ రైతులు ఉన్నారని.. ఈ దిగుమతి సుంకం పెంచడంతో వారికి అదనంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందంటూ సంతోషం వ్యక్తం చేశారు. దిగుమతి సుంకాలు విధించడంతో పామాయిల్ రైతులకు మేలు జరగనున్నదని చెప్పారు. అదేవిధంగా గెలల ధరల పెరుగుదలతో కొత్త రైతులు పామాయిల్ సాగు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపుతారంటూ ఆయన చెప్పుకొచ్చారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో కేంద్రానికి రూ. 80 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతుందంటూ మంత్రి స్పష్టం చేశారు.

Related News

IAS Officers: క్యాట్‌లోనూ ఆ ఐఏఎస్‌లకు చుక్కెదురు

CM Revanth Reddy : మరోసారి హస్తీనాకు సీఎం రేవంత్‌రెడ్డి… ఆశావహుల్లో ఉత్కంఠ

MP Aravind: బీఆర్ఎస్‌కు పట్టిన గతే.. మీకూ పడుతుంది: ఎంపీ అరవింద్

Delhi Congress Committee: ఇద్దరు మంత్రులకు కీలక భాద్యతలు అప్పగించిన అధిష్టానం.. కారణం అదేనా.. మరేదైనా ఉందా ?

Minister Ponnam: అలా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం.. జాగ్రత్త: మంత్రి పొన్నం

Minister Seethakka: దామగుండం ప్రాజెక్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే జీవో ఇచ్చింది: మంత్రి సీతక్క

CM Revanth Reddy: దేశ రక్షణకు అన్ని విధాలా సహకరిస్తా.. ఆ నేతల మాదిరిగా రాజకీయాలు చేయను.. సీఎం రేవంత్

Big Stories

×