AI Turns As A Doctor: ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ శాసిస్తోంది. ప్రతి రంగంలోనూ ఏఐ అద్భుతాలను సృష్టిస్తోంది. తాజాగా వైద్యరంగంలో పెను సంచలనాలకు కారణం అవుతోంది. ఇరాక్, ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కృత్రిమ మేధస్సు(AI) తో సరికొత్త కంప్యూటర్ అల్గారిథమ్‌ను రూపొందించారు. కేవలం నాలుగు రంగును చూసి రోగం ఏంటో చెప్పేలా ఏఐ మోడల్ డాక్టర్ ను తీర్చిదిద్దారు. రోగ నిర్ధారణ 98% కచ్చితత్వాన్ని కలిగి ఉంటుందన్నారు.
బాగ్దాద్, ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో అనుబంధంగా ఉన్న అలీ అల్ నాజీ నేతృత్వంలో ఈ పరిశోధన కొనసాగింది. సాధారణంగాడయాబెటిస్ ఉన్న వ్యక్తుల నాలుక నలుపు రంగులో ఉంటుంది. క్యాన్సర్ రోగుల నాలుకపై మందపాటి ఊదారంగు పూతను కలిగి ఉంటారు. తీవ్రమైన స్ట్రోక్స్ తో బాధపడే వారి నాలుక డిఫరెంట్ రెడ్ కలర్‌తో ఉంటుందట. నాలుకల రంగును బట్టి ఏఐ మోడల్ డాక్టర్ ఆరోగ్య సమస్యలను గుర్తించే అవకాశం ఉందని అల్ నాజీ వెల్లడించారు.
రక్తహీనత ఉన్నవారి నాలుక తెలుపు రంగంలో, జీర్ణాశయ సమస్యలు ఉండే వారి నాలుక నీలం రంగులోకి మారుతుందని పరిశోధకులు తెలిపారు. నాలుక రంగును బట్టి ఈజీగా వ్యాధిని గుర్తించే అవకాశం ఉందన్నారు.
⦿ 5,200 ఫోటోలతో ఏఐ మోడల్ డాక్టర్ కు ట్రైనింగ్
నాలుక రంగులను బట్టి వ్యాధిని నిర్థారించేందుకు ఏఐ మోడల్ డాక్టర్ కు ఏకంగా 5 వేల 200 ఫోటోలతో ట్రైనింగ్ ఇచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. అంతేకాదు, మిడిల్ ఈస్ట్ లోని రెండు హాస్పిటల్స్ కు చెందిన 60 మంది పేషెంట్ల నాలుకల ఫోటోలను ఉపయోగించి ఏఐ మోడల్ ను పరీక్షించినట్లు వెల్లడించారు. ఈ పరీక్షల సమయంలో, రోగులను ల్యాప్ టాప్ వెబ్ క్యామ్ నుంచి దాదాపు 8 అంగుళాల దూరంలో ఉంచారు. ఏఐ వారి నాలుక ఫోటో తీసి వ్యాధి ఏంటో కచ్చితంగా నిర్థారించిందని పరిశోధకులు తెలిపారు. అన్ని పరీక్షల్లో ఏఐ మోడల్ కచ్చితంగా వ్యాధిని నిర్థారించినట్లు తెలిపారు.
Also Read: బరువు తగ్గించే 5 మార్గాల గురించి మీకు తెలుసా ?
⦿ యాప్ తో ఈజీగా వ్యాధులను నిర్ధారించే అవకాశం
తాజాగా పరీక్షించిన ఏఐ మోడల్ ను యాప్ రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉందని సౌత్ ఆస్ట్రేలియా వర్సిటీకి ప్రొఫెసర్ జవాన్ చాల్ వెల్లడించారు. ఈ యాప్ సాయంతో డయాబెటిస్, రక్తహీనత, ఉబ్బసం సహా పలు రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించే అవకాశం ఉందన్నారు. ఈ యాప్ ద్వారా తక్కువ ఖర్చుతో నాలుకను పరిశీలించి వ్యాధులను నిర్థారించవచ్చన్నారు.
⦿ నాలుక మీద వెంట్రుకలు దేనికి సంకేతం?
కొంత మందిలో నాలుకపై నలుపు, గోధుమరంగు, తెలుపు రంగులో వెంట్రుకల మాదిరి పూత కనిపిస్తుంది. అలాంటి నాలుకను హెయిరీ టంగ్ గా పిలుస్తారు. ప్రోటీన్లు నాలుకపై చిన్న చిన్న గడ్డలుగా పొడవుగా పెరగడానికి కారణమవుతాయి. నాలుక మీద ఫుడ్ తో పాటు బాక్టీరియాను ఉండేలా చేస్తాయి. నాలుక మీది పాచిని సరిగా తొలగించకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది.
అయితే, ఒక్కోసారి హెయిరీ టంగ్ ఉన్న వారిలో తీవ్రమైన వ్యాధులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎప్ స్టిన్ బార్ లేదంటే HIV లాంటి వైరల్ ఇన్ఫెక్షన్లను సూచిస్తుందన్నారు. ఇలాంటి తీవ్ర సమస్యలను కూడా ఏఐ మోడల్ డాక్టర్ గుర్తిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.