Bomb Threat: బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తం అయిన అధికారులు జెడ్డా నుండి హైదరాబాద్ వస్తున్న విమానాన్ని.. ముంబయి ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు.
విమానం ముంబయి విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాక, ప్రత్యేక బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ టీమ్ (BDDS) ద్వారా విమానాన్ని పూర్తిగా తనిఖీ చేశారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, లగేజీతో సహా ప్రతి విభాగాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. అయితే ఇప్పటివరకు ఎటువంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.
విమానంలో ఉన్న 180 మందికి పైగా ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని ఇండిగో అధికారులు తెలిపారు.
మరోవైపు, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా అదనపు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అంతర్జాతీయ విమానాలపై కఠిన తనిఖీలు ప్రారంభించారు. CISF సిబ్బంది ప్రతి బాగేజ్, కార్గో విభాగాన్ని అదనంగా స్కాన్ చేస్తున్నారు.
Also Read: చతిస్గడ్ పర్యటనకు ప్రధాన మోడీ
బాంబు బెదిరింపు ఇమెయిల్ వెనుక ఎవరు ఉన్నారు? దాని ఉద్దేశ్యం ఏమిటి? అనే అంశాలపై సైబర్ క్రైమ్ పోలీస్‌లు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఐపీ అడ్రెస్, సర్వర్ లొకేషన్, మెయిల్ ట్రాన్స్మిషన్ టైమ్‌లైన్ వంటి వివరాలను ట్రాక్ చేస్తున్నారు. గతంలో ఇలాంటి ఇమెయిల్ బెదిరింపులు వచ్చిన సందర్భాలు ఉన్నప్పటికీ, అధికారులు దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నారు.