Veerabrahmendra Swamy : ఇటీవల కురిసిన వర్షాలకు కందిమల్లాపల్లెలో స్వల్పంగా కూలిన బ్రహ్మంగారి నివాసాన్ని అధికారులతో కలిసి కడప జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అసలు ఈ ఘటన ఏ విధంగా, ఎందుకు జరిగింది అన్నదాని పై రెవెన్యూ, దేవాదాయశాఖ అధికారులతో పాటు మఠం నిర్వాహకులు, బ్రహ్మంగారి సంరక్షకులను అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ శ్రీధర్. 1978-79 మధ్య కాలంలో ఈ ఇంటిని మట్టి, పలకరాయి, చెక్క స్తంభాలతో నిర్మించినట్టుగా స్థానికులు తెలిపారు. దీంతో గత వైభవం ఏ మాత్రం చెక్కుచెదరకుండా , భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఇంటాక్ సంస్థ సహకారంతో ఇంటిని పూర్వపు మెటిరియల్‌తో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు.