E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఫ్రీగా రిజిస్ట్రేషన్!
Advertisement

Indiramma Towers: ఇందిరమ్మ టవర్స్ లోని ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం తన ఎక్స్ లో పోస్టు చేశారు. ఇప్పటికే రెరా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఇందిరమ్మ టవర్స్ ద్వారా నిర్మించే ఒక్కో ఇంటి మార్కెట్ విలువ దాదాపు రూ. 50 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుందని మంత్రి వెల్లడించారు. ఇంతటి విలువైన ఆస్తిని పేదలకు అందించడమే కాకుండా, లబ్ధిదారులపై పైసా భారం పడకుండా ప్రభుత్వమే ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందని స్పష్టం చేశారు.

లబ్ధిదారుల ఎంపిక..

శంకుస్థాపన జరిగిన ఏడాదిలోపే ఇందిరమ్మ టవర్స్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను అప్పగిస్తామని హామీ ఇచ్చారు.ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలుకొని, ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వారికి అందించే వరకు ప్రతి దశలోనూ పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.

నాణ్యత విషయంలో..

Advertisement

ఒక ప్రభుత్వ ప్రాజెక్టు రెరాలో నమోదు కావడం ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.ప్రాజెక్టుకు రెరా గుర్తింపు లభించడం వల్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా అమలవుతాయని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినా, నిబంధనలను ఉల్లంఘించినా లేదా నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహించినా సంబంధిత సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెరా నిబంధనల ప్రకారం ఏదైనా లోపం జరిగితే నేరుగా ఫిర్యాదు చేసే అధికారం కూడా లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చిందని ఆయన వివరించారు.

Also read: బరువు తగ్గాలని మీరు కూడా ఇలా చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!

Tags

Related News

ఆ లెక్కలు అన్ని బైటపెట్టండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు సవాల్?

హైదరాబాద్‌లో ఒంటరి ప్రయాణాలు వద్దు: సీపీ ఎం. రమేష్!

నేను కావాలని ఆ పదం అనలేదు.. మాట దొర్లాను: మంత్రి సీతక్క!

పెట్టుబడులే లక్ష్యం.. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ఆదేశాలు!

బరువు తగ్గాలని మీరు కూడా ఇలా చేస్తున్నారా.. అయితే బీ కేర్ ఫుల్!

బుల్లెట్ బండి వివాదంలో.. హుజూర్‌నగర్ ఎస్ఐ సస్పెండ్!

తప్పు చేసింది మీరు.. ఇదిగో ఆధారాలు.. ఎంపీ చామల ఫైర్!

Big Stories

Advertisement
×