E-Paper
Advertisement

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!

Mahabubabad Municipality: మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వాహనాలు రయ్ రయ్.. గెలుపు గుర్రాల కోసం విశ్వ ప్రయత్నాలు!
Advertisement

Mahabubabad Municipality:  మహబూబాబాద్ స్వేచ్ఛ:  కనీ విని ఎరుగని రీతిలో మహబూబాబాద్ మునిసిపాలిటీలో వినూత్న ప్రచార సాధనాలను కౌన్సిలర్లు వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి ఎన్నికల్లో  వినియోగించినట్లుగానే ప్రచార సాధనాలను వినియోగించి వార్డుల్లో రయ్ రయ్ అంటూ అభ్యర్థుల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. సోషల్ మీడియా లో వాట్సాప్, ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల్లో తాము చేసే ప్రచారం, చేయదలచుకున్న అభివృద్ధిని వివరిస్తున్నారు. 17వ వార్డులో ప్రచారం మొదలైంది.

ప్రచారంలో దూకుడు 

మహబూబాబాద్ మున్సిపాలిటీ లోని 36 వార్డులకు  తుది జాబితా తయారు అయితే ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనేది పూర్తిస్థాయిలో తేలిపోనున్నది. దీంతో 36 వార్డుల్లో ప్రచారం ఊపందుకునే అవకాశం ఉంది. ఇప్పటివరకు మహబూబాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 34 వ వార్డులో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్, కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ నాయుడు మధ్య టఫ్ ఫైట్ జరగనుంది. అటు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుండ రాజశేఖర్, ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుటి సురేష్ నాయుడు తమ తమ మంది మార్బలంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం

Advertisement

17వ వార్డులో కూడా నేటి నుంచి ప్రచారం విస్తృతం కానుంది. ఇక్కడ పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి మునిసిపల్ చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే 17వ వార్డు గతంలో యాళ్ల పుష్పలత రెడ్డి సిట్టింగ్ వార్డు కావడంతో అక్కడి నుంచి ఆమె కుమారుడు బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు మురళీధర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న గుగులోత్ నరేష్ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ దాఖలు చేసి ప్రచారం నిర్వహిస్తున్నాడు. తాజాగా సీట్ల సర్దుబాటు లో భాగంగా 17వ వార్డు కేటాయించడంతో మూడు బాలు చౌహాన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రచారం నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను సిద్ధం చేసుకున్నాడు. ముఖ్యంగా మహబూబాబాద్ మున్సిపాలిటీలో 17వ వార్డు, 19 వ వార్డు 34వ వార్డుల్లో ప్రచారం విస్తృతంగా సాగుతోంది.

Also Read: CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో సీఎం మీటింగ్!

ప్రజల కోసం పనిచేశా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీరుటి సురేష్

Advertisement

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు నాకు ఎలాంటి పదవి లేకున్నా 34వ వార్డు కోసం విశేషంగా కృషి చేస్తున్న. నెహ్రూ సెంటర్ నుంచి మంగళ్ కాలనీ వరకు రూ.50 లక్షలతో అభివృద్ధి చేస్తున్న రహదారి కి సెంట్రల్ లైటింగ్ కోసం కూడా రూ.20 లక్షలు కేటాయించిన పనులను స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరణ చేయించాను. పులి గోపాల్ రెడ్డి నగర్, సెవెన్ హిల్స్ రహదారులను అభివృద్ధి చేసేందుకు రూ.50 లక్షలతో శంకుస్థాపనలు చేయించాను.

రూ.2కోట్లతో అభివృద్ధి చేయిస్తా

ఓపెన్ జిమ్, సురేంద్ర హైట్స్ అపార్ట్మెంట్ ముందు ఉన్న గ్రీన్ ల్యాండ్లను రూ.2కోట్లతో అభివృద్ధి చేయిస్తాను. బ్రహ్మకుమారిస్ ముందు రోడ్డు నుంచి సత్రం బజారు వరకు రహదారి పూర్తిగా చెడిపోవడంతో సిసి రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తాను. లక్ష్మీ టాకీస్ ఎదురుగా ఉన్న రహదారిని సైతం పూర్తిస్థాయిలో సీసీ నిర్మించేందుకు విశేషంగా కృషిచేసి 34 వ వార్డు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాను. 80 ఫీట్ల రోడ్డును సిసి రోడ్డుగా నిర్మించి సెంట్రల్ లైటింగ్ తో పాటు ఇరువైపులా చెట్లు నాటి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాకింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేపిస్తాను. ప్రధానంగా 34 వ వార్డులో పేరుకుపోయిన సమస్య అమృత్ పథకం ద్వారా పెద్ద పైపులు అమర్చి తాగునీటి వసతులను అందుబాటులోకి తీసుకొస్తాను. 34 వ వార్డు ప్రజలు తనను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపిస్తే నిత్యం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తా.

ప్రజలకు అండగా ఉంటా.. బీఆర్ఎస్ అభ్యర్థి గుండా రాజశేఖర్

గతంలో రెండుసార్లు 34 వ వార్డు ప్రజలు నన్ను దీవించి ఆశీర్వదించారు. నేను కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆపద సమయంలో ఆదుకుంటూ వస్తున్నాను. మళ్లీ గెలిపిస్తే ప్రజలకు అండగా ఉంటాను. ఆపద సమయంలో ఆదుకున్నాను… ఇకపై కూడా కుటుంబ సభ్యుడు లాగా ఉండి ఆదుకునేందుకు కృషి చేస్తాను. 34వ వార్డు ప్రజలు రెండుసార్లు నన్ను గెలిపించి నేను చేస్తున్న మంచి పనులకు మళ్లీ ఆదరిస్తారని ఆశిస్తున్న. 34వ వార్డు ప్రజలపై నాకు అమోఘమైన నమ్మకం ఉంది. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని విశ్వాసం ఉంది. ఇప్పటివరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్న.. మళ్లీ గెలిపిస్తే వారికి అండగానే ఉంటా.

Also Read:Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!

Related News

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Hyderabad: పైరవీలకు చెక్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం, ముఖ్యనేతలకు కీలక సూచనలు

వారెవ్వా గోల్కొండ! భక్తులతో కిక్కిరిసిన కోట.. అధికారుల ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?

Big Stories

Advertisement
×