E-Paper
Advertisement

CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో సీఎం మీటింగ్!

CM Revanth Reddy: బీఫామ్ ఇచ్చిన వాళ్లను గెలిపించుకోవాల్సిందే.. నేడు ఇంచార్జ్ మంత్రులతో  సీఎం మీటింగ్!
Advertisement

CM Revanth Reddy:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: నేడు ఇన్ చార్జ్ మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)  ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించనున్నారు. మున్సిపల్ ఎన్నికలు పై చర్చించనున్నారు. ఇక అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలుపై డిస్కషన్ చేయనున్నారు. దీంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, డెవలప్ మెంట్ ప్రోగ్రస్ పై కూడా ఆరా తీయనున్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికలపై సీఎం జూమ్ మీటింగ్ నిర్వహించారు. బీ ఫామ్ ఇచ్చినోళ్లను గెలిపించుకోవాల్సిందేనని నొక్కి చెప్పారు. రెబల్స్ ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Also ReadCM Revanth Reddy: నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్.. ఆ విషయాలపై క్లారిటీ!

రెబల్ అనే ప్రచారం జరగకూడదు 

Advertisement

పార్టీ ఆదేశించిన తర్వాత రెబల్ అనే ప్రచారం జరగకూడదన్నారు. నేతలంతా సమన్వయంగా పనిచేయాలని, జిల్లా అధ్యక్షులుకూడా ఎప్పటికప్పుడు పార్టీ పరిస్థితులను అధిష్టానానికి తెలియజేయాలన్నారు. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే నిలిచాయని, ఎవరూ అధైర్యపడవద్దని వివరించారు. పార్టీ నేతల శ్రమ వృధా కానివ్వమన్నారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కార్యకర్తల కష్టమేనని సీఎం వివరించారు.

టీపీసీసీ అధికారికంగా ఆమోదిస్తూ తీర్మానం

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ లు పాల్గొన్నారు. మరోవైపు మున్సిపల్ ఎన్నికల్లో టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేసిన అభ్యర్థుల జాబితా ను టీపీసీసీ అధికారికంగా ఆమోదిస్తూ తీర్మానం చేసింది. ఆ వెంటనే బీ ఫా మ్ లు అందజేసే కార్యక్రమం మొదలైంది. గాంధీభవన్ లో పీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ సమక్షంలో జహీరాబాద్ మున్సిపాలిటీ అభ్యర్ధులకు బీ ఫామ్స్ అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు, ఇన్ చార్జ్ మంత్రుల సమక్షంలో బీ ఫామ్ లు అందజేయనున్నారు.

Advertisement

Also Read: CM Revanth Reddy: సీఎం రేవంత్‌కు మరో అరుదైన ఆహ్వానం.. ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలంటూ లేఖ

Related News

దేశవ్యాప్తంగా నీట్ పీజీ ఎగ్జామ్.. మద్యం తాగి పరీక్షా కేంద్రానికి వచ్చిన స్టూడెంట్, తెలంగాణలో ఘటన

టీఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ.. సొంతగడ్డపై కవిత బల ప్రదర్శనా? తెలంగాణ రాజకీయాల్లో చర్చ

బంగాళాఖాతంలో అల్పపీడనం, ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరి హైదరాబాద్ మాటేంటి?

సర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ!

హుజూరాబాద్ యునాని ఆసుపత్రిలో దారుణం.. డాక్టర్, ఫార్మసిస్ట్ కోసం రోగుల ఎదురుచూపులు!

2027 గోదావరి పుష్కరాలకు ప్రిపరేషన్ సిద్ధం.. ఈసారి భక్తుల కోసం చేసే ప్రత్యేక ఏర్పాట్లు ఇవే?

పొర్లి పొర్లి దండాలు పెట్టినా బిఆర్ఎస్‌కు అధికారం దక్కదు.. మంత్రి పొంగులేటి ఛాలెంజ్!

శ్రీశైలం నీళ్లు తరలించేందుకు ఏపీ భారీ స్కెచ్.. ఎండిపోతున్న పాలమూరు, నాగార్జునసాగర్ ప్రాజెక్ట్!

Big Stories

Advertisement
×