E-Paper
Advertisement

Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!

Ponguleti Srinivas Reddy: పదేళ్లు పత్తాలేరు.. ఇప్పుడొచ్చి దండాలు పెడుతున్నారా? గులాబీ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!
Advertisement

Ponguleti Srinivas Reddy: ఖమ్మం బ్యూరో స్వేచ్ఛ :  పదేళ్ల పాటు ప్రజలను గాలికొదిలేసి ఇవాళ ఎన్నికలు రాగానే దండాలు పెట్టుకుంటూ వస్తున్న నాయకులను నమ్ముదామా? పేదోడికి ఓ రేషన్ కార్డు ఇవ్వడానికి మనసు రాని వాళ్లకు మళ్లీ ఓట్లు వేయాలా? అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) గులాబీ నేతలపై విరుచుకుపడ్డారు. సోమవారం ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2, 22, 23, 24, 26, 27వ వార్డుల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన ప్రసంగం ఆద్యంతం వాడివేడిగా సాగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఏ సంక్షేమం అర్హుల దరిచేరకుండా వారిని నమ్మించి మోసం చేసిన ఘనత ముమ్మాటికీ వారిదేనని ఎద్దేవా చేశారు. ఇప్పుడు తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గాలి మోటార్ల నాయకులకు.. గల్లీ కష్టాలేం తెలుసు

గత ప్రభుత్వ తీరుపై పొంగులేటి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. “నాడు ఫామ్ హౌస్‌లకే పరిమితమై, గాలి మోటార్లలో తిరిగిన నాయకులకు.. ఈ గల్లీల్లో డ్రైనేజీలు పొంగుతుంటే, ఇళ్లు మునుగుతుంటే ఏనాడైనా కనిపించాయా?” అని నిలదీశారు. రాజీవ్ గృహకల్ప వాసులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోని వారు, ఇవాళ ఎన్నికల కోసం కొత్త నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి పేదవాడికి రేషన్ కార్డులు ఇచ్చి ఆకలి తీర్చామని, అది కాంగ్రెస్ మార్కు పాలన అని చెప్పారు.

Advertisement

Also Read:Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..! 

ముంపు కష్టాలకు రిటైనింగ్ చెక్

మాట ఇస్తే మడమ తిప్పే అలవాటు తనకు లేదన్నారు… జూన్ కల్లా కరకట్ట పూర్తి చేసి మీ ముంపు కష్టాలు తీర్చి తీరుతా” అని మంత్రి మరోమారు హామీ ఇచ్చారు. రూ. 690 కోట్లతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ ఏదులాపురానికి రక్షణ కవచంలా మారుతుందని, రాజీవ్ గృహకల్ప ఇళ్లకు కొత్త హంగులు అద్దడంతో పాటు ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ఇప్పటికే మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో కలిపి సుమారు రూ.308 కోట్లతో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, ఏదులాపురాన్ని రాష్ట్రానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటేయాలని, కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పొంగులేటి పిలుపునిచ్చారు.

Advertisement

Also Read: Minister Seethakka: ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగిన మంత్రి సీతక్క.. మీ కుట్రలు సాగవని హెచ్చరిక..!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×