BigTV English

IPS AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరో కీలక పదవి..

IPS AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్.. మరో కీలక పదవి..

IPS AV Ranganath: రేవంత్ సర్కార్ హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు మరో కీలకమైన బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన లేక్స్‌ ప్రొటెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ కమిటీ ఛైర్మన్‌గా హెచ్‌ఎండీఏ కమిషనర్‌ కొనసాగుతున్నారు. ఏడు జిల్లాల పరిధిలో చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కిందకు తేవడంతో ఆక్రమణలకు గురికాకుండా కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.


రేవంత్ సర్కార్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువులు పరిరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డు వరకున్న చెరువులు, కుంటలు, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఆక్రమించి చేపట్టించిన నిర్మాణాలను హైడ్రా కూల్చి వేస్తోంది. అయితే హెచ్ఎండీఏ పరిధిలో దాదాపు ఏడు జిల్లాలున్నాయి. వీటి పరిధిలోని చెరువుల పరిరక్షణను హైడ్రా కిందకు దాదాపు తీసుకొచ్చింది. దీనివల్ల చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కాపాడవచ్చని ప్రభుత్వ అంచనా.

ALSO READ:  బీఆర్ఎస్ ట్వీట్‌కు కౌంటరిచ్చిన భట్టి.. మళ్లీ రియాక్టైన హరీశ్‌రావు


చెరువుల పరిరక్షణ విషయమై రేపో మాపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలావుండగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల చెరువుల సర్వే, ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై దృష్టి సారించారు హెచ్ఎండీఏ కమిషనర్.

ఇందులోభాగంగా సోమవారం ఏడు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఏడు జిల్లాల పరిధిలో దాదాపు 3500 చెరువులు ఉన్నాయి. ఇప్పటివరకు కేవలం 265 వరకు మాత్రమే గుర్తించారు. మరో 50 చెరువులు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లేక్ సిటీ చుట్టూ చెరువులను పరిరక్షణ చర్యలు చేపడితే గ్రౌండ్ వాటర్ పుష్కలంగా ఉంటుందని భావిస్తోంది. దీనివల్ల ఎలాంటి వరదలు వచ్చిన ఎలాంటి సమస్య ఉండదన్నది ప్రభుత్వం లెక్క. రీసెంట్‌‌గా వచ్చిన వరదలు బెజవాడను బీభత్సం సృష్టించిన విషయాన్ని కొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు.

అంతేకాదు గత సమ్మర్‌లో బెంగుళూరు పరిస్థితులను గమనించిన ప్రభుత్వం, తొలుత చెరువుల పరిరక్షణపై దృష్టి సారించింది. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.. కూల్చివేస్తోంది కూడా. చాన్నాళ్లు తర్వాత లేక్ సిటీకి మంచిరోజులు వచ్చాయని అంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×