Lady Aghori : లేడీ అఘోరీ ఎపిసోడ్ చంచల్‌గూడ జైలుకు చేరింది. చీటింగ్ కేసులో చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. లెక్క ప్రకారమైతే సంగారెడ్డి సబ్ జైలులో ఉంచాలి అఘోరీని. కానీ, అఘోరీ ఆడా? మగా? క్లారిటీ కావాలంటూ అక్కడి జైలు అధికారులు రిజెక్ట్ చేశారు. చేసేది లేక పోలీసులు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. ట్రాన్స్‌జెండర్ ఫిమేల్ అని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. అలాంటి వారిని చేర్చుకోమంటూ ముందే చెప్పేశారు సంగారెడ్డి జైలు సిబ్బంది. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక బ్యారక్ కేవలం చంచల్‌గూడ జైల్లో మాత్రమే ఉంది. అందుకే, లేడీ అఘోరీని చివరాఖరికి చంచల్‌గూడకు తరలించారు. అక్కడి ట్రాన్స్‌జెండర్స్ సెల్‌లో ఉంచారు. ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మేటర్.
ట్రాన్స్‌జెండర్స్‌తో ముప్పు ఉందా?
లేడీ అఘోరీ వర్సెస్ ట్రాన్స్‌జెండర్స్. మొదటి నుంచీ ఇరువర్గాల మధ్య పెద్ద రచ్చే నడుస్తోంది. శ్రీనివాస్ అసలు హిజ్రానే కాదంటూ ఆ వర్గం మండిపడుతోంది. తమ వర్గం అంటే ఒప్పుకోమంటూ తేల్చి చెబుతోంది. అక్కడ కాలిస్తే.. ఆపరేషన్ చేసుకున్నాడని కూడా ఆరోపించారు కొందరు ట్రాన్స్‌జెండర్స్. అఘోరీని తమకు అప్పగిస్తే.. అంతుచూస్తామని ఇప్పటికే హెచ్చరించారు. లేడీ అఘోరీ ఆగడాలపై అనేక మంది హిజ్రాలు గళమెత్తారు. వాడో ఫేక్ అంటూ, మోసగాడంటూ తిట్టిపోశారు. అఘోరీ మొదటి భార్యకు మద్దతుగా నిలిచారు. ఇలా ట్రాన్స్‌జెండర్స్ వర్గమంతా ఫస్ట్ నుంచి లేడీ అఘోరీ అంటే కోపంతో రగిలిపోతోంది.
జైల్లో అఘోరీ సేఫేనా?
కట్ చేస్తే.. ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ మాత్రమే ఉండే ప్రత్యేక బ్యారక్‌లో లేడీ అఘోరీని ఉంచారు. ఇన్నాళ్లూ ఏ వర్గం నుంచి అయితే వ్యతిరేకత వచ్చిందో.. ఇప్పుడు అదే వర్గానికి చెందిన నేరస్తుల మధ్య అఘోరీ ఉండాల్సి రావడం ప్రమాదకరమే అంటున్నారు. హిజ్రాలు చాలా రఫ్ బిహేవియర్‌తో ఉంటారు. వారిలో తరుచూ గ్యాంగ్ వార్స్ కూడా జరుగుతుంటాయి. కత్తులతో పొడుచుకోవడం, రాడ్లు, బీర్ సీసాలతో కొట్టుకోవడం లాంటి గొడవలు కామన్. ఆయా కేసుల్లో నిందితులంతా చంచల్‌గూడ జైల్లోనే ఉన్నారు. ఇప్పుడు వారి మధ్య అఘోరీ ఉంటుంది. మరి, అది సేఫ్ ప్లేసేనా? అనే అనుమానం తలెత్తుతోంది. అఘోరీపై మండిపడుతున్న బ్యాచ్.. జైల్లో అటాక్ చేసే ప్రమాదం ఉండదా? అనే ప్రశ్న వినిపిస్తోంది.
Also Read : అఘోరీని ఎన్‌కౌంటర్ చేయాలి.. పోలీసులతో వర్షిణి హంగామా..
అఘోరీ రక్షణపై ఆందోళన
జైల్లో స్ట్రిక్ట్ రూల్సే ఉంటాయి. 24 గంటలు గాడ్స్ కాపలా ఉంటారు. అయినా, దాడులు జరగవనే గ్యారెంటీ లేదంటున్నారు. ఎందుకంటే గతంలో జైల్లో గొడవలు జరిగిన ఘటనలు ఉన్నాయంటున్నారు. అందుకే ఇప్పుడు అఘోరీ రక్షణపైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె భక్తులు. అఘోరీ అమ్మను ట్రాన్స్‌జెండర్స్‌తో కలిపి ఉంచొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు.