Kiraack Boys Khiladi Girls 2 : రీసెంట్ టైమ్స్ లో కొన్ని రియాలిటీ షోస్ చాలా దారుణంగా తయారవుతున్నాయి. రియాలిటీ షోస్ అంటే ఇంట్లో కూర్చున్న ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూస్తారు అని కంప్లీట్ గా మర్చిపోయినట్లు ఉన్నారు. ఇక రీసెంట్ గా ఒక షో హిందువుల మనోభావాలు దెబ్బతీసే స్థాయికి వెళ్లిపోయింది. దీనిపైన యాంకర్ రవి కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి డబుల్ మీనింగ్ ఉన్న ప్రోమో ఒకటి ఇప్పుడు విడుదలైంది. ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేసినా కూడా కొంతమందికి ఇబ్బందిగా అనిపిస్తుంది. అది అనసూయ ముందు అటువంటి డైలాగులు వేసినా కూడా తను చెప్పకపోవడం బాధాకరం.
అసలు విషయం ఏమిటంటే
స్టార్ మా లో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అని ఒక ఎంటర్టైన్మెంట్ షో మొదలైంది దానిలో చాలామంది డూప్ యాక్టర్స్, చాలా సినిమాల్లో ఫేమస్ అయిన కొన్ని గెటప్స్ ను కొంతమంది కమెడియన్స్ తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వేసుకుని వచ్చారు. ఈ తరుణంలో చిట్టిబాబు పాత్రను కూడా ఒకరు వేసుకొచ్చారు. అయితే చిట్టిబాబుని ఉద్దేశిస్తూ యాంకర్ శ్రీముఖి “అవును చిట్టిబాబు నిన్న రాత్రి నువ్వు రంగమ్మత్త కలిసి బోటులో ఏదో చేశారట నేను చూశాను” అని అనగానే రంగమ్మత్త టక్కున నవ్వింది. దీనికి వెంటనే ఏ రంగమ్మత్త ఏమంటావ్ అంటే, నేనేమంటాను చిట్టి బాబు నువ్వే చెప్పు అనేసిందే అనసూయ. ఏదేమైనా కానీ ఆ సీన్ కి సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంది. అటువంటి సీన్ ను కూడా ఇలా అనసూయ ముందే డబల్ మీనింగ్ లో పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది.
Also Read : Srinidhi Shetty : కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఆ పని కూడా చేసిందట
రంగస్థలం బెస్ట్ సీన్
రంగమ్మత్త క్యారెక్టర్ అనసూయ కి ఎంత మంచి పేరు తీసుకొచ్చిందో అందరికీ తెలిసిన విషయమే. చాలామంది అప్పటినుంచి అనసూయను రంగమ్మత్త అని పిలవడం కూడా మొదలుపెట్టారు. రంగమ్మత్త ఊరికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం. అలానే తన భర్త వాచ్ చిట్టి బాబుకి ఇవ్వడం. వీరిద్దరి మధ్య ఆ సినిమాలో బాండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక సందర్భంలో అనసూయ మీద చేయి వేసినప్పుడు ” చెయ్యి తీరా బాబు మా ఆయన అసలే ఊర్లో లేడు” అనే డైలాగ్ ఆ క్షణానికి నవ్వు తెప్పిస్తుంది గాని ఇబ్బందిగా అనిపించదు. కానీ ఈ షోలో మాట్లాడిన మాటలు మాత్రం ఖచ్చితంగా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. మొత్తానికి అనసూయ తెలివిగా తప్పించుకోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేయటం ఇంకా ఇబ్బందిగా అనిపిస్తుంది.
Also Read : Nani : అంటే సుందరానికి బ్యాడ్ ఫిలిం అంటే, వాళ్లతో నేను గొడవ పడతా