BigTV English

Congress: అక్కడ సిద్ద, శివ.. ఇక్కడ భట్టి, రెడ్డి..? కర్నాటకం రిపీట్స్?

Congress: అక్కడ సిద్ద, శివ.. ఇక్కడ భట్టి, రెడ్డి..? కర్నాటకం రిపీట్స్?
CONGRESS

Congress: కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ అవినీతి పాలన ఆ పార్టీకి తీవ్ర నష్టం చేసి.. డబుల్ ఇంజిన్ సర్కారుకు దెబ్బేసింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ల జోడెద్దుల బండి.. కాంగ్..రేస్‌ను విజయతీరాలకు చేర్చింది. అయితే, గెలిచిన ఆనందం ఆ పార్టీకి కొన్నిగంటలు కూడా లేదు. ఎవరు సీఎం? అంటూ రచ్చ మొదలైంది. సిద్ధ, శివ.. నేనంటే నేనంటూ అధిష్టానం ముందు పంచాయితీ పెట్టారు. సిద్ధరామయ్యనేమో సీనియర్ లీడర్.. డీకే శివకుమార్ పీసీసీ చీఫ్.. ఇద్దరూ ఇద్దరే. ఇద్దరిలో ఒక్కరే అంటే.. నిర్ణయం చానా కష్టమైపోతోంది కాంగ్రెస్‌కి.


కర్నాటక ఇష్యూ ఏ తీరాలకు చేరుతుందో కానీ.. కర్నాటకం తెలంగాణలోనూ చర్చనీయాంశమైంది. అక్కడి లానే ఇక్కడి సర్కారు కూడా అవినీతి ఊబిలో కూరుకుపోయిందని.. ప్రజావ్యతిరేకత తీవ్రంగా ఉందని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ జోరు మీదుంది. భారత్ జోడో యాత్ర, హాత్ సే హాత్ జోడో యాత్ర, పీపుల్స్ మార్చ్, నిరుద్యోగ సభ, యూత్ డిక్లరేషన్లతో జోష్ పెరిగింది. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అంతా తానై కాంగ్రెస్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అటు, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క తనదైన స్టైల్‌లో నీట్‌గా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. రేవంత్ హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తే.. భట్టి పీపుల్స్ మార్చ్ అంటూ ప్రజల్లో ఉంటున్నారు. వారిద్దరి జోడి.. కర్నాటక మాదిరి అవుతుందా? తెలంగాణలోనూ కర్నాటకం రిపీట్ అవుతుందా? అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సీఎం పీఠం కోసం రేవంత్, భట్టిల మధ్య కూడా సిద్ధరామయ్య, శివకుమార్ మాదిరే రచ్చ జరుగుతుందా? అనే డౌటు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే దళిత సీఎం నినాదం ఎత్తుకున్నారు భట్టి వర్గం. సీనియర్లంతా జట్టు కట్టి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా.. విక్రమార్కకు మద్దతుగా ఏదో చేస్తున్నారు. సీఎం రేసులో ఉన్నట్టు ఇప్పటినుంచే తనంతట తాను ప్రమోట్ చేసుకుంటున్నారు భట్టి. ఇదంతా వ్యూహాత్మక ఎత్తుగడ అని.. రేవంత్‌ ఎక్కడ సీఎం అయిపోతారోననే టెన్షన్ సీనియర్లలో ఉందని అంటున్నారు. అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం అలాంటి వ్యాఖ్యలే చేశారు. తాము కష్టపడి ఎవరినో సీఎంను చేయాలా? అంటూ పరోక్షంగా రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా కామెంట్స్ చేయడం కలకలం రేపింది. కర్నాటక ఎపిసోడ్‌తో అవన్నీ మళ్లీ గుర్తుకు వస్తున్నాయని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.


ఇక, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని.. కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌తో పోలుస్తున్నారు. కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిందంటే డీకేనే కారణం అనేదాంట్లో అనుమానమే లేదు. కేసులు పెట్టినా, జైలుకు పంపినా.. అదరక బెదరక కాంగ్రెస్ గెలుపు బాధ్యతలను తనమీదే వేసుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా సవాల్ చేసి మరీ, చెప్పినట్టే పార్టీని గెలిపించి చూపించారు. తీరా ముఖ్యమంత్రి పదవి విషయానికి వచ్చేసరికి.. నేనున్నానంటూ డీకేకు పోటీగా సిద్ధరామయ్య నిలుచున్నారు. కష్టం ఆయనది.. సీనియార్టీ పేరుతో పదవి ఈయనదా? అనే టాక్ వినిపిస్తోంది కర్నాటక కాంగ్రెస్‌లో. మరి, తెలంగాణలోనూ అలానే జరుగుతుందా? కాంగ్రెస్ గెలిస్తే.. సీఎం సీటు కోసం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్కల మధ్య పోటీ వస్తుందా? అందుకోసమేనా ఈ పాదయాత్రలు? సభలు? సీఎం నినాదాలు? అనే చర్చ నడుస్తోంది తెలంగాణ కాంగ్రెస్‌లో!

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×