Big Stories

Karnataka: అంతా తూచ్.. సీఎం ఎంపిక మళ్లీ మొదటికి.. కాంగ్రెస్‌లో అంతే!

karnataka cm

Karnataka: కర్ణాటక సీఎం కుర్చీ కొట్లాట మళ్లీ మొదటికొచ్చింది. సీఎంగా సిద్ధరామయ్యను ఎంపిక చేశారు.. ఇక ప్రమాణస్వీకారమే తరువాయి అన్నట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. సీఎం ఎవరన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ సీనియర్ నేత రణదీప్‌ సింగ్ సూర్జేవాలా తెలిపారు. బీజేపీ చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. కర్ణాటక సీఎం ఎవరన్నది కాంగ్రెస్ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే ప్రకటిస్తారని చెప్పారు. సాయంత్రం లేదంటే గురువారం.. సీఎం ఎవరన్నది తెలుస్తోందని.. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దన్నారు సూర్జేవాలా.

- Advertisement -

తాజా ప్రకటనతో సిద్ధరామయ్య వర్గం సంబరాలు ఆగిపోగా.. నిరాశలోకి వెళ్లిపోయిన డీకే శివకుమార్ వర్గంలో మళ్లీ కొత్త ఆశలు చిగురించినట్టైంది. కర్నాటక సీఎం ఎవరన్నదానిపై మళ్లీ ఉత్కంఠ మొదలైంది.

- Advertisement -

అంతకుముందు ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసేందుకే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు ప్రచారం జరిగింది. డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ గా ప్రకటించనున్నారని తెలిసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో డీకే, సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సీఎం పదవి విషయంలో ఇద్దరి ముందు ఖర్గే పలు ప్రతిపాదనలు చేశారని తెలుస్తోంది. మొదటి రెండేళ్లు సిద్ధరామయ్యకి, ఆ తర్వాత మూడేళ్లు డీకే శివకుమార్‌కు సీఎం పదవి ఇచ్చేలా అధిష్టానం ప్రతిపాదన చేసినట్టు ప్రచారం జరిగింది. డీకేకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు పలు కీలక శాఖలు అప్పగిస్తారని లీకులు వచ్చాయి. కానీ, అదంతా ఫేక్ ప్రచారం అంటూ అధిష్టానం తరఫున సుర్జేవాలా ప్రకటన చేయడంతో విషయం మళ్లీ మొదటికి వచ్చినట్టైంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News