E-Paper
Advertisement

Rajaiah Vs Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం ముగిసినట్టేనా..? ఆ 25 లక్షలతో సయోధ్య కుదిరిందా..?

Rajaiah Vs Sarpanch Navya: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదం ముగిసినట్టేనా..? ఆ 25 లక్షలతో సయోధ్య కుదిరిందా..?
Advertisement

MLA Rajaiah Vs Sarpanch Navya(Telugu news updates): స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకిపురం సర్పంచ్ నవ్య మధ్య వేధింపుల వివాదంలో కొత్త మలుపు తిరిగింది. జానకిపురం గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే రాజయ్య.. 25 లక్షలు మంజూరు చేస్తూ ప్రొసిడింగ్ లెటర్ ఇచ్చారు. దీంతో సర్పంచ్ నవ్య.. ఎమ్మెల్యే రాజయ్యకు ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమక్షంలో రాజయ్య ఇచ్చిన ప్రొసిడింగ్ లేఖ చూపించి భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు సర్పంచ్ నవ్య.

అయితే గ్రామాభివృద్ధికి నిధులు ఇచ్చినంత మాత్రాన.. ఎమ్మెల్యే రాజయ్యపై తన పోరాటం ఆపబోనన్నారు సర్పంచ్ నవ్య. రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మంజూరు చేసిన 25 లక్షల రూపాయలను గ్రామాభివృద్ధికే ఖర్చు చేస్తానని ఆమె తెలిపారు.

Advertisement

ఇక ఎమ్మెల్యే రాజయ్య వద్ద తన భర్త తీసుకున్న ఏడు లక్షల రూపాయలను.. ఏదైనా అమ్మి తిరిగి ఇచ్చేయాలని భర్తకు ఆల్టిమేటం ఇచ్చారు. తల తాకట్టు పెట్టైనా. రూ. 7 లక్షలు భర్త తిరిగి చెల్లించాల్సిందేనని సూచించారు. నిజాయితీగా ఎమ్మెల్యే వేధింపులపై పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఆధారాలతో మహిళా కమిషన్‌ను ఆశ్రయిస్తానని సర్పంచ్ నవ్య తేల్చి చెప్పారు.

Related News

Contract Teachers: ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్.. రూ.21.99 కోట్ల నిధులు విడుదల!

Voter Revision: హైదరాబాద్‌లో ఓట్ల తొలగింపు కుట్ర?.. విజిలెన్స్ డేగ కన్ను..!

Banjara Ekta: బంజారా ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ నెల 27న ఢిల్లీలో భారీ బహిరంగ సభ!

కానిస్టేబుల్ పై ఫోక్సో కేసు నమోదు.. ఎక్కడంటే..?

నీట్ అక్రమాలపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే.. బీజేపీపై ఎంపీ చామల ఫైర్!

హైదరాబాద్‌లో ఆ ఓట్లపై కాంగ్రెస్, MIM కన్ను.. రంగంలోకి దిగిన బీజేపీ!

కాంగ్రెస్ నడిచే పడవ కాదు.. మునిగే పడవ.. ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు!

కేవలం రూ. 6 లక్షలకే హైదరాబాద్‌లో ఇల్లు.. ప్రభుత్వం బంపరాఫర్!

Big Stories

Advertisement
×