BigTV English

Automobile industry: ఆటోమొబైల్ రంగంలో భారీ లాభాలు.. రూ.8.7 లక్షల కోట్లు..

Automobile industry: ఆటోమొబైల్ రంగంలో భారీ లాభాలు.. రూ.8.7 లక్షల కోట్లు..
“Frankfurt, Hessen, Germany – April 04, 2012: Car drives up a ramp made from coins.”

Automobile industry: కోవిడ్ తర్వాత అన్ని రంగాలు భారీ నష్టాల్లోకి వెళ్లిపోయాయి. అవి కోలుకొని లాభాలు చవిచూడడానికి చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం చూస్తున్న రిపోర్టుల ప్రకారం 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో ఆటోమొబైల్ రంగం లాభాల్లోకి వెళ్లిన్నట్టు తెలుస్తోంది. ఏకంగా రూ.8.7 లక్షల కోట్ల రెవెన్యూను ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ.. 2023 ఫైనాన్షియల్ ఇయర్‌లో సాధించిందని రిపోర్టులు చెప్తున్నాయి. 2024లో దీనికి మించిన లాభాలు రావాలని టార్గెట్‌గా పెట్టుకుంది.


ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో దాదాపు 1.9 కోట్ల మంది ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. 2.7 కోట్ల యూనిట్స్ ఆటోమొబైల్స్ తయారీలో నిమగ్నమయి ఉన్నాయి. ఇవన్నీ కలిసి రూ.8.7 లక్షల రెవెన్యూను సాధించడం మంచి విషయమని ఆటోమొబైల్ సంస్థలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అన్నింటికంటే ఎక్కువగా ఈ రెవెన్యూ పెరగడంలో కీలక పాత్ర పోషించింది ప్యాసెంజర్ వెహికిల్స్ (పీవీ) అని తెలుస్తోంది. మొత్తం రెవెన్యూలో పీవీ 58 శాతాన్ని సాధించింది. అంటే దాదాపు రూ. 5 లక్షల కోట్లు.

ప్యాసెంజర్ వెహికిల్ తరువాతి స్థానంలో 2 వీలర్స్ ఉన్నాయి. రెవెన్యూలో ఇవి 21 శాతాన్ని దక్కించుకున్నాయి. అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్లు. ఆ తర్వాతి స్థానంలో కమర్షియల్ వెహికిల్స్ (సీవీ) 19 శాతంతో ఉంది. అంటే రూ. 1.7 లక్షల కోట్లు. చివరిగా 3 వీలర్‌కు 2 శాతం రెవెన్యూ దక్కింది. అంటూ రూ. 17 వేల కోట్లు. ఇక పీవీ విషయంలో ఎస్‌యూవీల హవా కొనసాగింది. ఈ రెవెన్యులో కూడా సగభాగం ఎస్‌యూవీ వల్లే సాధ్యమయ్యిందని రిపోర్ట్ చెప్తోంది. వీటితో పాటు లగ్జరీ వెహికిల్స్ కూడా 13 శాతం రెవెన్యూను అందించాయి.


గత కొన్నేళ్లలో కస్టమర్లు ఎక్కువగా మినీ కార్లను కొనడానికి ఆసక్తి చూపించడం లేదని రిపోర్టులో తేలింది. మినీ కార్ల విషయంలో మారుతి, హ్యుండాయ్, టాటా, మహీంద్ర, కియా, టయోటా, హోండా, వోల్క్స్‌వేగన్ లాంటి కంపెనీలు నష్టాలనే చవిచూసినట్టు తెలుస్తోంది. లాభాలను బట్టి కంపెనీలు తమ యూనిట్లను కూడా పెంచే సన్నాహాలు చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అంతే కాకుండా 2023 ఫైనాన్షియల్ ఇయర్ లాభాలను 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో బీట్ చేయాలని చాలావరకు సంస్థలు టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×