E-Paper
Advertisement

IT Raids : తెలంగాణలో ఐటీ దాడులు.. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్..

IT Raids :  తెలంగాణలో ఐటీ దాడులు.. కాంగ్రెస్ అభ్యర్థులే టార్గెట్..
Advertisement

IT Raids : ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్ధులపై ఐటీ వేట మొదలైంది. హైదరాబాద్‌లో ఐటీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్ధి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి శంషాబాద్‌లోని నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. తెల్లవారజాము 5 గంటల నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 50 మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు.

మాధాపూర్ లోని ఆఫీసుతోపాటు కోకాపేటలోని NCC అర్బన్ అపార్ట్‌మెంట్‌లోని ఇంటిపై దాడులు కొనసాగుతున్నాయి.
ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈ సోదాల్లో పాల్గొంటున్నారు. కేఎల్ఆర్ వియ్యంకుడు రాజేందర్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టారు.

Advertisement

మహేశ్వరంలో కేఎల్‌ఆర్‌ గెలుపు ఖాయమన్న భయంతోనే ఆయన్ని టార్గెట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు.
ఎన్ని కుయుక్తులు పన్నినా మహేశ్వరం లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామంటున్నారు కేఎల్ ఆర్ అభిమానులు. ఇలా ఎన్నికల ముందుకు ఐటీ దాడులు చేయడంపై మండిపడుతున్నారు. ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×