BigTV English

IND vs SL Match : శ్రీలంకను కొడితే..సెమీస్ కే !

IND vs SL Match : శ్రీలంకను కొడితే..సెమీస్ కే !

IND vs SL Match : 2023 వన్డే వరల్డ్ కప్ లో అందరూ ఎదురుచూస్తున్న శ్రీలంక -భారత్ మధ్య మ్యాచ్ ముంబై వాంఖేడి స్టేడియంలో జరగనుంది. అయితే  ఎదురులేకుండా దూసుకెళుతున్న ఇండియా మరి శ్రీలంకను మట్టికరిపిస్తుందా? లేదా? అనేది చూడాలి.


ఆరు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక నాలుగింట ఓడిపోయింది. ఇప్పుడు ఇండియాతో కూడా ఓడిపోతే సరాసరి ఇంటి దారి పడుతుంది. ఒకవేళ గెలిస్తే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే మళ్లీ సెమీస్ రేస్ లోకి వస్తుంది. ఇది శ్రీలంక పరిస్థితిగా ఉంది.

ఇక ఇండియా విషయానికి వస్తే, శ్రీలంకపై గెలిస్తే నేరుగా సెమీఫైనల్ లో అడుగు పెడుతుంది. ఒకవేళ ఓడినా పెద్ద నష్టం లేదు. తర్వాత నెదర్లాండ్, సౌతాఫ్రికాతో ఆడనుంది. సౌతాఫ్రికాతో కష్టమైనా నెదర్లాండ్ తో గెలిచి సెమీస్ కి వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.


టీమ్ ఇండియాలో పెద్ద మార్పులు లేవు. హార్దిక్ పాండ్యా జట్టులోకి రావడం లేదు. డైరక్టుగా సెమీస్ లోకి తీసుకుందామని అనుకుంటున్నారు. అప్పటివరకు మహ్మద్ షమీ, సూర్యకుమార్ యాదవ్ తో జట్టు బలోపేతంగానే కనిపిస్తోంది. ఎటొచ్చి శ్రేయాస్ అయ్యర్ పరిస్థితి మేనేజ్మెంట్ ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. తను కూడా ప్రాక్టీస్ సెషన్ లో చెమటోడ్చి కష్టపడ్డాడు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడటంతో సంయమనం చూపించాడు. శుభ్ మన్ గిల్ ఇంకా ప్రతాపం చూపించలేదు. సెమీ పైనల్, ఫైనల్ లో తను సీరియస్ గా ఆడాలని అంతా కోరుకుంటున్నారు.

శ్రీలంక విషయానికి వస్తే  జట్టు కెప్టెన్ శానక, పతిరన, కుమార గాయాలతో జట్టుకి దూరమయ్యారు. అది జట్టు సమతుల్యతను దెబ్బతీసింది. బౌలర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. అందుకు తగినట్టుగానే బ్యాటింగ్ ఉంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ల్లో ఎవరూ కూడా అద్భుతంగా ఆడిన దాఖలాలు లేవు. ఆఫ్గనిస్తాన్ తో ఓడిపోవడంతో వారు మానసికంగా కుంగిపోయారు. మరి ఇండియాపై ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

ఇకపోతే విరాట్ కొహ్లీకి శ్రీలంకపై బ్రహ్మాండమైన ట్రాక్ రికార్డ్ ఉంది. మరి దానిని నిలబెట్టుకుని సెంచరీ చేసి సచిన్ కి చేరువవుతాడా? నవంబర్ 5న జరిగే సౌతాఫ్రికాతో మ్యాచ్ లో బర్త్ డే గిఫ్ట్ గా 50 వ సెంచరీ చేస్తాడా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×