E-Paper
Advertisement

క‌విత‌ను ఓడ‌గొట్టింది నిజామాబాద్ ఎమ్మెల్యేలే! జీవ‌న్‌రెడ్డి పాత కామెంట్స్‌ను వైర‌ల్ చేసిన తెలంగాణ జాగృతి!

క‌విత‌ను ఓడ‌గొట్టింది నిజామాబాద్ ఎమ్మెల్యేలే!  జీవ‌న్‌రెడ్డి పాత కామెంట్స్‌ను వైర‌ల్ చేసిన తెలంగాణ జాగృతి!
Advertisement

ఎవ‌రి గోల వారిదే. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి ఇవాళ జీవ‌న్‌రెడ్డి కేటీఆర్ స‌మ‌క్షంలో బీఆరెస్‌లో చేరుతున్న‌ట్టు ప్ర‌క‌టించాడు. వెంట‌నే క‌విత టీం రంగంలోకి దిగింది. క‌విత నిజామాబాద్ ఎంపీగా రెండోసారి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయినప్పుడు ఇదే జీవ‌న్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను తెలంగాణ జాగృతి లీడ‌ర్లు వైర‌ల్ చేశారు. బీఆరెస్‌కు చెందిన ఎమ్మెల్యేలే క‌విత‌ను కావాల‌ని ఓడ‌గొట్టార‌ని జీవ‌న్‌రెడ్డి చేసిన కామెంట్స్ అవి.

ఆయ‌న ఇంకా ఏమ‌న్నారంటే.. అక్క‌డ క‌విత గెలిస్తే త‌మ మీద ఆధిప‌త్యం చెలాయిస్తుంద‌నే భ‌యంతో కావాల‌ని ప‌ని గ‌ట్టుకుని ఎమ్మెల్యేలంతా క‌లిసి ఓడగొట్టారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలిచి.. ఆ త‌రువ‌త జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో క‌విత‌కు అంత త‌క్కువ ఓట్లు ఎట్లా వ‌చ్చిన‌యి..? దీనికి కార‌ణం ఆ ఎమ్మెల్యేలే. త‌మ పెత్త‌నం న‌డ‌వ‌ద‌ని, అధికారం అంతా ఆమె చుట్టే ఉంటుంద‌ని భ‌య‌పడ్డారు. ఓడిపోతే ఈ ఛాయ‌ల‌కు రాకుండా పోతుంద‌ని, త‌మ ఆధిప‌త్యం న‌డుస్తుంద‌ని వారు ఇలా చేశారంటూ కామెంట్ చేసిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ చేసుకుంటున్నారు జాగృతి నాయ‌కులు.

Advertisement

ఈ విష‌యం క‌విత‌కు కూడా తెలుసున‌ని, పార్టీ అధిష్టానానికి కూడా నివేదిక‌లు అందాయ‌ని జీవ‌న్‌రెడ్డి పేర్కొన్నారు. అంటే క‌విత‌కు ఆనాటి నుంచి కుట్ర‌లు ప‌న్ని రాజ‌కీయంగా స‌మాధి చేయాల‌ని అంతా భావించార‌ని జాగృతి ఆ పాత చ‌రిత్ర‌ను గుర్తు చేస్తున్నారు. ఈ విష‌యం తెలిసీ కేసీఆర్, కేటీఆర్‌.. ఆ పార్టీ ఎమ్మెల్యేల‌ను ఎందుకు ఉపేక్షించార‌ని, ఎందుకు వీరిపై చ‌ర్య‌లు తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

అంతా ఒక్క‌టై.. క‌విత‌ను రాజ‌కీయాల నుంచి పూర్తిగా వైదొలిగేలా చేయాల‌నేది కేటీఆర్ అండ టీమ్ కుట్ర‌.. అందులో భాగంగానే ఆమె ఓడింద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. జీవ‌న్‌రెడ్డి పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించిన కొన్ని గంట‌ల్లోనే జీవ‌న్‌రెడ్డి పాత వీడియో చ‌క్క‌ర్లు కొడుతున్న‌ది. అంటే.. చెల్లెకు న్యాయం చేయ‌నోడు.. కుట్ర‌లు ప‌న్నినోడు.. ప‌క్క‌పార్టీ నేత‌ల‌ను పార్టీలోకి ఆహ్వానిస్తూ చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని విమ‌ర్శిస్తున్నారు.

Advertisement

బీఆరెస్ వేసే ప్ర‌తీ అడుగు, కేటీఆర్ చేసే ప్ర‌తీ కామెంట్‌ను తెలంగాణ జాగృతి నిశితంగా ప‌రిశీలిస్తున్న‌ది. ఎప్ప‌టిక‌ప్పుడు కేటీఆర్‌ను, ఆ పార్టీ విధానాల‌ను, ప‌దేళ్ల పాల‌నను ఎండ‌గ‌ట్టి డిఫెన్స్‌లో ప‌డేయ‌టంతో పాటు క‌విత‌కు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌జ‌ల‌కు మరింత‌గా వివ‌రించే ప్ర‌య‌త్నం జాగృతి నాయ‌కులు చేస్తున్నారు.

Tags

Related News

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

Big Stories

Advertisement
×