BigTV English

Janasena: తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం.. ఆ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు..?

Janasena: తెలంగాణలో జనసేన పోటీకి సిద్ధం.. ఆ స్థానాల్లో అభ్యర్థులపై కసరత్తు..?

Janasena: ఏపీలో ప్రచారం కోసం వారాహి వాహనం సిద్ధం చేసిన పవన్ కల్యాణ్.. ఇటు తెలంగాణపైనా ఫోకస్ చేశారు. ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ తెలంగాణ కార్యవర్గం కసరత్తు చేస్తోంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఇప్పటికే 32 నియోజకవర్గాలకు కార్యాచరణను సిద్ధం చేసింది. ఆయా నియోజకవర్గాలకు కార్య నిర్వాహకులను నియమించింది. వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి నివేదిక రూపొందిస్తారు. ఆ నివేదిక ఆధారంగానే టికెట్లను కేటాయిస్తామని జనసేన పార్టీ తెలంగాణ ఇన్ ఛార్జ్ శంకర్​గౌడ్ ప్రకటించారు.


వీరికే బాధ్యతలు
సనత్​నగర్‌కు మండపాక కావ్య, జూబ్లీహిల్స్ కు​ ఎస్.రమేష్, ముషీరాబాద్ కు బిట్ల రమేష్, కుత్బుల్లాపూర్‌ కు నందగిరి సతీష్​కుమార్, నడిగడ్డకు నాగేంద్రబాబు, మల్కాజ్​గిరికు దామరోజు వెంకట్ చారి, ఎల్‌బి నగర్‌కు పొన్నూరు లక్ష్మీ సాయి శిరీష, శేర్​లింగంపల్లి కు చిరాగ్ ప్రజీత్ గౌడ్, వైరాకు తేజావత్ సంపత్​నాయక్, మంచిర్యాలకు సైదాల శ్రీనివాస్, కంటోన్మెంట్ కు కత్తి సైదులు, రామగుండంకు మూల హరీష్​గౌడ్, నాగర్ కర్నూల్ కు ​వంగ లక్ష్మణ్​గౌడ్, కొల్లాపూర్ కు బైరపోగు సాంబశివుడు, ఖమ్మంకు మిరియాల రామకృష్ణ, కొత్తగూడెంకు వేముల కార్తీక్, సంగారెడ్డి కు కూన వేణు, సత్తుపల్లికి బండి నరేష్, అశ్వారావుపేటకు డేగల రామచంద్రరావు, మునుగోడుకు గోకుల రవీందర్​రెడ్డి, పఠాన్​చెరువుకు యడమ రాజేష్, హుజూర్​నగర్ కు సరికొప్పుల నాగేశ్వరరావు, నకిరేకల్ కు ​చెరుకుపల్లి రామలింగయ్య, వనపర్తికి నైని ముకుంద నాయుడు, సిద్ధిపేట్​ కు దాసరి పవన్, హుస్నాబాద్ కు తగరపు శ్రీనివాస్, జగిత్యాలకు బెక్కం జనార్ధన్, స్టేషన్​ఘనపూర్ కు ​గాదె పృధ్వీ, నర్సంపేట్​ కు మెరుగు శివకోటి యాదవ్‌ ను కార్యనిర్వాహకులుగా ప్రకటించారు.

తెలంగాణలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి 32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకులను ఎంపిక చేశారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×