BigTV English

Jaya Jayahe Telangana Song: జయ జయహే తెలంగాణ.. జూన్ 2న సోనియా చేతుల మీదుగా విడుదల..!

Jaya Jayahe Telangana Song: జయ జయహే తెలంగాణ.. జూన్ 2న సోనియా చేతుల మీదుగా విడుదల..!

Telangana State Song Jayahe Telangana: తెలంగాణ రాష్ట్ర గీతంపై ప్రభుత్వం కసరత్తు పూర్తయింది. ప్రముఖ కవి అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గీతంలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. ఈ గీతానికి సంగీత దర్శకుడు కీరవాణి సంగీతాన్ని అందించారు. ఒకటిన్నర నిమిషం నిడివితో తెలంగాణ రాష్ట్ర గీతాన్ని కంపోజ్ చేశారు. ఈ గీతాన్ని జూన్ 2న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్లు తెలుస్తోంది.


“జయజయహే తెలంగాణ.. ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం..” అంటూ సాగే ఈ గీతాన్ని అందెశ్రీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటవ్వక ముందే రాశారు. నిజానికి అందెశ్రీ చదువుకోలేదు. 21 ఏళ్లు తాపిమేస్త్రిగా పనిచేశారు. సహజంగానే ఆయనకు కవిత్వం చెప్పడం వచ్చింది. తన కవిత్వానికి అక్షరరూపమివ్వాలన్న కాంక్షతో రాయడం నేర్చుకున్నారు. డిగ్రీలు చదవకపోయినా.. యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లు అందుకున్నారు.

నదులపై కవిత్వం రాయాలని.. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైలు వంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ.. కవితలు రాశారు. 2003లోనే తెలంగాణ కోసం ప్రత్యేక పాట రాయాలని సంకల్పించిన అందెశ్రీ.. ఆ ఆలోచన వచ్చిందో లేదో నాలుగు చరణాలు రాసేసారు. అదే ఏడాది నవంబర్ 11న ఆదిలాబాద్ లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనంలో ఆ పాటను పాడి వినిపించారు.


Also Read: ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఏం చర్చించారంటే..?

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×