E-Paper
Advertisement

Jeevan Reddy : కేసీఆర్‌పై విమర్శలు.. జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం!

Jeevan Reddy : కేసీఆర్‌పై విమర్శలు.. జీవన్ రెడ్డి  సంచలన నిర్ణయం!

Jeevan Reddy : ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామంటూ జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చారు. అలాగే నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని బాండ్ ద్వారా హామీ ఇచ్చారు. ప్రజలకు విశ్వాసపాత్రునిగా ఉంటానని ప్రమాణ పత్రంతో దేవాలయంలో పూజలు చేశారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రశ్న పత్రాలను అమ్ముకున్న ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని విమర్శించారు. అన్ని అర్హతలున్నా జగిత్యాలను జిల్లా కేంద్రంగా చేయలేదని జీవన్ రెడ్డి ఆవేదన తెలియ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13స్థానాలు క్లీన్ స్వీప్ చేస్తామని అభ్యర్థి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో జీవన్‌రెడ్డి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ రాష్ట్రమంతా ఎందుకు తిరుగుతున్నారు? వంద సభల్లో పాల్గొంటున్నా అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఓటమి ఖరారవడంతోనే కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారని ఆయన విమర్శించారు. జగిత్యాలను జిల్లా కేంద్రం చేశానంటూ సీఎం కేసీఆర్ చెప్పడాన్ని జీవన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు . జిల్లా అవడానికి అన్ని అర్హతలు జగిత్యాలకు ఉన్నాయన్నారు. కరీంనగర్‌ కంటే ముందే చాలా ప్రభుత్వ కార్యాలయాలు జగిత్యాలలో ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×